Yogi Adityanath : మహిళా బిల్లుపై యోగీ ప్రశంసలు-విప్లవాత్మక అడుగుగా అభివర్ణన..
కేంద్రం ఎన్నికల వేళ పార్లమెంటులో తీసుకొచ్చిన మహిళా బిల్లుపై దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. దశాబ్దాలుగా మూలనపడిన మహిళా బిల్లును పార్లమెంటులో తమకున్న మెజార్టీతో ఆమోదింపచేసుకునేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కూడా కేంద్రం తెచ్చిన మహిళా బిల్లుపై ప్రశంసల జల్లు కురిపించారు.
పార్లమెంటులో కేంద్రం తెచ్చిన నారిశక్తి వందన్ బిల్లు మహిళా సాధికారత దిశగా ఒక విప్లవాత్మక ముందడుగు అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. ఇందులో యోగీ ఆదిత్యనాథ్ మహిళా బిల్లును ప్రవేశపెట్టడం భారతదేశానికి గర్వకారణమని అన్నారు. ఇది గొప్ప ప్రజాస్వామ్య విజయం అన్నారు. లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమర్పించిన 'నారీశక్తి వందన్ అధినియం' మహిళా సాధికారత దిశగా విప్లవాత్మక ముందడుగు అని యోగీ తెలిపారు.

ఈ బిల్లు కోసం దేశంలోని మహిళా శక్తి ఎదురుచూస్తోందని యోగీ తెలిపారు. ఈ సందర్భంగా మహిళల్ని ఆయన అభినందించారు . ఇది మహిళల జనాభాకు హక్కులను ఇవ్వడమే కాకుండా భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలంగా, మరింత భాగస్వామ్యాన్ని కలిగిస్తుందని అన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో ఇది పెద్ద పాత్ర పోషిస్తుందని యోగీ వెల్లడించారు. ఈ బిల్లు తెచ్చినందుకు ప్రధాని మోదీకి యోగీ కృతజ్ఞతలు తెలిపారు.
రాజ్యాంగ సవరణ అవసరమయ్యే బిల్లును తీసుకురావడం ద్వారా, పార్టీల మధ్య ఏకాభిప్రాయం కోసం 27 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న లోక్‌సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్ కల్పించేందుకు మోడీ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా కొత్త పార్లమెంట్ భవనాన్ని ఏర్పాటు చేసినందుకు దేశ పౌరులకు సీఎం యోగీ ఆదిత్యనాథ్ అభినందనలు తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల రాజ్యాంగ హక్కులను సూచించే కొత్త పార్లమెంటు భవనం మానవ విలువల స్థాపనతో పాటు మన బలమైన, బంగారు భవిష్యత్తుకు శాశ్వత చిహ్నంగా మారుతుందన్నారు.












Click it and Unblock the Notifications