వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేదార్‌నాథ్‌లో 8 గంటలు సీఎంల నిరీక్షణ.. మరునాడు బద్రీనాథ్ పయనం..ఎందుకంటే...

|
Google Oneindia TeluguNews

ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఆగాల్సి వచ్చింది. వీరిద్దరూ బద్రీనాథ్ వెళ్లాల్సి ఉంది. అయితే మంచు కురియడంతో కేదారినాథ్‌లోనే ఆగిపోయారని అధికారులు ప్రకటించారు. ఇద్దరూ సీఎంలు మంగళవారం ఉదయం బద్రీనాథ్ వెళతారని పేర్కొన్నారు.

ఆదివారం రాత్రి రుద్రప్రయాగ్‌లో గల కేదార్ నాథ్‌కు సీఎంలు ఇద్దరూ చేరుకున్నారు. అభివృద్ధి పనులను పరిశీలించారు. ఉదయం దర్శనాల ముగింపు వేడుకకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు యూపీ టూరిజం డెవలప్ మెంట్ గెస్ట్ హౌస్‌కు శంకుస్తాపన చేశారు. తర్వాత రూ.11 కోట్లతో 4 వేల 10 స్వ్కేర్ మీటర్‌లో నిర్మించే గెస్ట్ హౌస్ ప్రారంభించేందుకు డెహ్రాడూన్ వెళ్లారు.

Yogi Adityanath, Uttarakhand CM Rawat stuck at Kedarnath for 8 hours due to snowfall

కేదార్ నాథ్‌లో మాత్రం మంచు కురుస్తూనే ఉంది. దీంతో యాత్రికులు, ఇతరులు వెళ్లడానికి వీలులేకుండా పోయింది. హెలికాప్టర్ బయల్దేరే పరిస్థితి లేదు. కానీ సాయంత్రం 4.30 గంటల తర్వాత పరిస్థితి కాస్త మెరగుపడింది. ఇద్దరూ సీఎంలు చమోలి జిల్లాలో గల గౌచర్ వచ్చారు. ఇక్కడినుంచి బద్రీనాథ్ 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

సీఎంలు ఇద్దరూ గౌచర్‌లో బస చేస్తున్నారని ఉత్తరాఖండ్ సీఎం మీడియా కోఆర్డినేటర్ దర్శన్ సింగ్ రావత్ తెలిపారు. మంగళవారం ఉదయం బద్రీనాథ్ వెళతారని తెలిపారు. కేదార్ నాథ్ ఆలయం సోమవారం మూసివేశారు. ఈ ఏడాది 1.35 లక్షల మంది యాత్రికులు మహా శివుడుని దర్శించుకున్నారు. గంగోత్రి ఆలయం ఆదివారం, యమునోత్రి సోమవారం మూసివేశారు. బద్రీనాథ్ ఆలయం మాత్రం ఈ నెల 19వ తేదీన మూసివేస్తారు.

English summary
Uttar Pradesh Chief Minister Yogi Adityanath and Uttarakhand CM Trivendra Singh Rawat were stuck at the Kedarnath shrine in Uttarakhand for over eight hours on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X