Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్‍కు బుల్డోజర్లతో స్వాతం పలికిన కార్యకర్తలు..
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంటే ఏం గుర్తోస్తుంది.. బుల్డోజర్లు గుర్తుకు వస్తాయి. తాజాగా ఆయన తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. హైదరాబాద్ లోని గోషామహల్ లో రాజా సింగ్ తరుఫున యోగి ప్రచారం చేశారు. అయితే బీజేపీ శ్రేణులు యోగికి వినూత్నంగా స్వాగతం పలికింది. బుల్డోజర్ పై నుంచి కార్యకర్తలు యోగి ఆదిత్యనాథ్ పై పూలు జల్లారు. ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ తో యోగి ఆదిత్యనాథ్ ఫేమస్ అవడంతో ఆయనకు బుల్డోజర్ పై నుంచి పూల వర్షం కురిపించారు.
తెలంగాణలో నియంత సర్కార్ ను తరిమేద్దామని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ పిలుపునిచ్చారు. పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని వాడు.. ప్రభుత్వం ఏం నడుపుతాడని ఎద్దేవా చేశారు. కేవలం ముస్లింల కోసమే బీఆర్ఎస్ పని చేస్తోందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పాటైన తెలంగాణ ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. కాళేశ్వరంలో పేరుతో కేసీఆర్ కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు.

తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని యోగి ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. కాంగ్రెస్ ఉంటే ఫ్రీ కరోనా వ్యాక్సిన్, బియ్యం ఇచ్చేదా? అని ప్రశ్నించారు. అంతకు ముందు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ లో నిర్వహిం చిన బీజేపీ సభలో ఆయన మాట్లాడారు. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తోందని ఆరోపించారు.
బీఆర్ఎస్ఓట్లు చీల్చేందుకు బీఎస్పీ రంగంలోకి దిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే బ్రష్టాచార్ రిష్వత్ కోర్ సమితి అని ఎద్దేవా చేశారు.
నీళ్లు నిధులు నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. 2017 కంటే ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎలా ఉండేదో అందరికీ తెలుసని.. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చాక ఒక్క రోజు కూడా అల్లర్లు జరిగిన సందర్భం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications