Yogi Surgical Strike:శభాష్ యోగీ.. ఆ అంశంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్..!

లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ మాఫియాపై కీలక ప్రకటన చేశారు. ఆయన మాట్లాడిన తీరు యావత్ దేశాన్ని ఆకట్టుకుంది. దీంతో ఒక్కసారిగా యోగీ ఆదిత్యనాథ్ సోషల్ మీడియాపై ట్రెండ్ అయ్యారు. మాఫియా పై అసెంబ్లీలో మాట్లాడని యోగీ ఆదిత్యనాథ్ రాష్ట్రంలో మాఫియాను అణగదొక్కుతామని సవాల్ విసిరారు. అనంతరం సమాజ్‌వాదీ పార్టీ నేతలకు అసెంబ్లీ వేదికగానే క్లాస్ పీకారు. మాఫియాను మొదలు పెట్టింది ఎవరు.. ప్రోత్సహిస్తోంది ఎవరు , మాఫియాతో సంబంధం ఉన్నవారిని ఎమ్మెల్యేలు, ఎంపీలుగా చేసి చట్టసభల్లోకి పంపిందెవరు అంటూ ఘాటు ప్రశ్నలు సంధించడంతో ఒక్కసారిగా నెటిజెన్లు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. దీంతో మూడు హ్యాష్‌ టాగ్‌లు #"#'Yogi Means Governance, '#Yogi Adityanath and #Yogi Surgical Strike ట్విటర్ పై ట్రెండ్ అయ్యాయి. దీనికర్థం ప్రభుత్వం పరిపాలన అంటే యోగీ అని, యోగీ సర్జికల్ స్ట్రైక్స్ ప్రారంభించారంటూ నెటిజెన్లు ట్రెండ్ చేశారు. యోగీ అంటే ప్రభుత్వం పరిపాలన అనే హ్యాష్ టాగ్ 65 కోట్లసార్లు టాప్ ట్రెండ్స్‌లో నిలిచింది.

ఇదిలా ఉంటే ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్ వాదీ పార్టీ యోగీ ఆదిత్యనాథ్‌ను గట్టిగానే కార్నర్ చేయడానికి ప్రయత్నించి విఫలమైంది. ప్రయాగరాజ్‌లో జరిగిన రాజుపాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్ కూడా హత్యగావించబడటం అనేదానిపై అసెంబ్లీలో చర్చ జరిగింది. అయితే ఇదంతా చేసింది ఎస్పీ మద్దతుగా నిలిచిన మాఫియా డాన్ అతీక్ అహ్మద్ అనే ఆరోపణలున్నాయి. దీన్నే యోగీ ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. సమాజ్‌వాదీ పార్టీ చేరదీసిన మాఫియా డాన్ అతీక్ అహ్మద్ దీని వెనకున్నారని యోగీ చెప్పగానే విపక్ష పార్టీ సభ్యులు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.

Yogi Surgical Strike: UP CM trends on twitter after speaking on Mafia in assembly

సమాజ్‌వాదీ పార్టీ పై అస్త్రాలు ఎక్కువపెట్టిన యోగీ ఆదిత్యనాథ్, ఒక మాఫియా డాన్‌ను ఆ పార్టీ చేరదీయడాన్ని ప్రశ్నించారు. సమాజ్‌వాదీ పార్టీ వారి హయాంలో మాఫియా డాన్లను ప్రోత్సహించడమే కాకుండా వారిని పూలమాలలో సన్మానించిందన్న విషయాన్ని యోగీ ఆదిత్యనాథ్ గుర్తు చేశారు. ప్రయాగ్‌రాజ్ ఘటనతో సంబంధం ఉన్న మాఫియా అతీక్ అహ్మద్ అండతో రెచ్చిపోతోందని చెప్పిన సీఎం, క్రిమినల్స్‌కు అండగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వన్ని విమర్శించే హక్కు లేదని అన్నారు. ఇదే క్రమంలో మాఫియాను అణిచివేయడంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడదని అసెంబ్లీ వేదికగా యోగీ ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+