పెట్రోల్, డీజీల్ ధరల్లో ప్రతిరోజూ మార్పు, కారణమిదే

ఇక నుండి ప్రతి రోజూ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజీల్ ధరలను సమీక్షించనున్నాయి. రోజుకోసారి పెట్రోల్, డీజీల్ రేట్లు హెచ్చు తగ్గుదలలు కన్పించనున్నాయి.

న్యూఢిల్లీ: ఇక నుండి ప్రతి రోజూ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజీల్ ధరలను సమీక్షించనున్నాయి. రోజుకోసారి పెట్రోల్, డీజీల్ రేట్లు హెచ్చు తగ్గుదలలు కన్పించనున్నాయి.

అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరలను ప్రతి రోజూ సమీక్షించాలని ఆయిల్ కంపెనీలు యోచిస్తున్నాయి.

గతంలో ప్రతి పదిహేను రోజులకు ఓసారి పెట్రోల్, డీజీల్ ధరలనుసమీక్షించేవారు.అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజీల్ ధరలలో మార్పులు చేసేవారు.

అయితే అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరల ఆధారంగా ప్రతి రోజు పెట్రోల్ , డీజీల్ ధరలను సమీక్షించాలని ఆయిల్ కంపెనీలు రంగం సిద్దం చేస్తున్నాయి.దేశీయ ఆయిల్ రిటైల్ మార్కెట్ ను 95 శాతం తమ చెప్పుచేతల్లో ఉంచుకొన్న ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ , భారత్ పెట్రోలియం, హిందూస్తాన్, పెట్రోలియం కంపెనీలు ఈ మేరకు అడుగులు వేస్తున్నాయి.

petrol, diesel rates

ఈ మేరకు ఓ ఆయిల్ కంపెనీకి చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్ ఈ విషయాన్ని వెల్లడించారు. రోజు వారీ ధరల సమీక్ష ఆధారంగా పెట్రోల్ , డీజీలు ధరలను మార్చనున్నట్టు ఆయన చెప్పారు. దీనికి అవసరమైన టెక్నాలజీ కూడ అందుబాటులో ఉన్నట్టు ఆ టాప్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు.

అందుబాటులో ఉన్న డిజిటల్ టెక్నాలజీలు, సోషల్ నెట్ వర్క్ లు కూడ రోజువారీ ధరల మార్పుకు అనుగుణంగా ఉన్నాయన్నారు. 53 వేల ఫిల్లిండ్ స్టేషన్లలో ధరల మార్పు సులభతరమేనన్నారు. అయితే కేవలం కొన్ని పైసల తేడాతోనే ధరల మార్పులు చోటుచేసుకొంటాయన్నారు. కస్టమర్లకు ఎలాంటి షాక్ ను కంపెనీలు ఇవ్వబోవన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+