రాహుల్ గాంధీపై లాలూ జోకులు- పడీ పడీ నవ్విన సీఎం

పాట్నా: వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ- దీని దూకుడును నిలువరించడానికి యూపీఏ సమాయాత్తమౌతోన్నాయి. ఎన్డీఏను ఉమ్మడిగా ఎదుర్కొనడానికి దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమౌతోన్నాయి. బిహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం సమావేశం కాబోతోన్నాయి. పాట్నాలోని సర్క్యుట్ హౌస్ దీనికి వేదికగా మారింది.

జనతాదళ్ (యునైటెడ్) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ భేటీకి సారథ్యాన్ని వహించనున్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, సీపీఐ, సీపీఎం.. వంటి 11 ప్రతిపక్ష పార్టీలు ఈ భేటీలో పాల్గొన్నాయి.

You must get married, Lalu Prasad Yadav advice Rahul Gandhi

తటస్థ వైఖరిని అనుసరిస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బిజూ జనతాదళ్.. దీనికి దూరంగా ఉన్నాయి. కేంద్రంపై యుద్ధం ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితికి కూడా ఆహ్వానం అందలేదు. ఈ భేటీ ముగిసిన అనంతరం ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, మమత బెనర్జీ, మాజీ ముఖ్యమంత్రులు లలూ ప్రసాద్ యాదవ్, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, అఖిలేష్ యాదవ్, మల్లికార్జున ఖర్గే.. తదితరులు మాట్లాడారు.

మరో విడతలో హిమాచల్ ప్రదేశ్‌ సిమ్లాలో సమావేశమౌతామని తెలిపారు. రాజకీయ విలువలు, ప్రజాస్వామ్య మూల సిద్ధాంతాలను కాపాడటానికి తామందరూ ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి, ధ్వంసానికి గురవుతోన్న రాజ్యాంగ విలువలను తిరిగి దక్కించుకోవడానికి వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. బీజేపీని ఓడించడానికి ఏకమౌతామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్.. తన దైన శైలిలో మాట్లాడారు. కర్ణాటకలో హనుమంతుడు తన గద్దతో బీజేపీని మట్టికరిపించాడని అన్నారు. హనుమంతుడే స్వయంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాడని పేర్కొన్నారు. భజరంగ్ దళ్‌నను నిషేధిస్తామంటూ హామీ ఇచ్చినప్పటికీ.. ప్రజలు కాంగ్రెస్‌ వైపే నిలిచారని గుర్తు చేశారు. హనుమంతుడు ప్రతిపక్షంలో చేరారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం తప్పదని జోస్యం చెప్పారు.

త్వరగా పెళ్లి చేసుకోవాలంటూ లాలూ ప్రసాద్ యాదవ్ ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి సూచించారు. ఇప్పటికీ మించి పోయిందేమీ లేదని, పెళ్లి చేసుకుని, ఓ ఇంటివాడివి కావాలంటూ ఆకాంక్షించారు. పెళ్లి వేడుకలకు అందరం కలిసి వెళ్దామని నవ్వుతూ చెప్పారు. రాహుల్ గాంధీ పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి లాలూ ప్రసాద్ యాదవ్ పక్కనే కూర్చున్న నితీష్ కుమార్ సహా అక్కడి వారందరూ పడీ పడీ నవ్వడం కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+