ముగ్గురు భర్తల ముద్దుల పెళ్లాం, బిడ్డ తండ్రి ఎవరు ? డీఎన్ఏ పరీక్షలు, పోలీసులకు చుక్కలు, నాలుగో లవర్

చెన్నై/రామనాథపురం: ఓ యువతి తన శారీరక సుఖం కోసం ముగ్గురు యువకులను వివాహం చేసుకుంది. ముగ్గురు భర్తల ముద్దల పెళ్లానికి 8 నెలల బిడ్డ ఉన్నాడు. ఇప్పుడు ఆ బిడ్డకు తండ్రి ఎవరు ? అనే విషయం తెలియకపోవడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఆ మహిళ ఇప్పుడు నాలుగో వ్యక్తితో శారీరక సంబంధం సాగిస్తోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ప్రస్తుతం ఆమె గర్బవతి. ఆ మహిళకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరు ? అనే విషయం తెలుసుకోవడానికి పోలీసులు డీఎన్ఏ పరీక్షలు చేయించడానికి సిద్దం అయ్యారు.

మూడేళ్ల క్రితం మొదటి పెళ్లి

మూడేళ్ల క్రితం మొదటి పెళ్లి

తమిళనాడులోని రామనాథపురం జిల్లాలోని కోరవల్లి గ్రామానికి చెందిన రేవతి (పేరు మార్చడం జరిగింది) మేస్త్రీగా పని చేస్తున్న దివ్యానందం అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కొంత కాలం దివ్యానందం, రేవతి దంపతులు కాపురం చేశారు. తరువాత చిన్న చిన్న విషయాలకు రేవతి, దివ్యానందం దంపతులు గొడవ పడేవారని తెలిసింది. తరువాత దివ్యానందంకు చెప్పాపెట్టకుండా రేవతి జెండా ఎత్తేసింది.

విదేశాలకు రెండో భర్త

విదేశాలకు రెండో భర్త

మొదటి భర్త దివ్యానందంకు దూరం అయిన రేవతి వినోద్ అనే యువకుడిని రెండో పెళ్లి చేసుకుంది. తరువాత వినోద్ రామనాథపురంలో రేవతితో కాపురం పెట్టాడు. ఉద్యోగం కోసం వినోద్ విదేశాలకు వెళ్లాడు. విదేశాలకు వెళ్లిన వినోద్ మూడు, నాలుగు నెలలు భార్య రేవతి అవసరాల కోసం డబ్బులు పంపించాడు. తరువాత వినోద్ విదేశాలలోనే మరణించాడని రేవతికి సమాచారం అందింది. అయితే వినోద్ ఎలా చనిపోయాడు అనే విషయం మాత్రం తెలియడం లేదు.

ముచ్చటగా మూడో పెళ్లి

ముచ్చటగా మూడో పెళ్లి

వినోద్ మరణించాడని సమాచారం రావడంతో రేవతి శరత్ అనే యువకుడిని మూడో పెళ్లి చేసుకుంది. రేవతికి 8 నెలల బిడ్డ ఉన్నాడు. ఇదే సమయంలో వినోద్ కుటుంబ సభ్యులు రేవతి దగ్గరకు వెళ్లారు. నువ్వు ఎవరినో పెళ్లి చేసుకుని తిరుగుతున్నావని, వినోద్ కు పుట్టిన బిడ్డను మాకు ఇచ్చేయాలని రేవతికి చెప్పారు. రేవతి దగ్గర ఉన్న బిడ్డను వినోద్ బంధువులు తీసుకెళ్లిపోయారని సమాచారం.

నాలుగో వ్యక్తితో అక్రమ సంబంధం

నాలుగో వ్యక్తితో అక్రమ సంబంధం

ఇదే సమయంలో మూడో భర్త శరత్ కు తెలీకుండా రేవతి మరో వ్యక్తితో అక్రమ సంబంధం సాగించింది. భార్య రేవతి అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న శరత్ రగిలిపోయాడు. మా దగ్గర పెరుగుతున్న బిడ్డను తన భార్య రేవతి ఎవరికో విక్రయించిందని ఆరోపిస్తూ మూడో భర్త శరత్ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

బిడ్డకు డీఎన్ఏ పరీక్షలు

బిడ్డకు డీఎన్ఏ పరీక్షలు

రేవతి గురించి తెలుసుకున్న పోలీసులు, మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, వినోద్ కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు. వినోద్ కు ఈ బిడ్డ పుట్టలేదని, ఈ బిడ్డ మాకు వద్దని తేల్చి చెప్పారు. అయితే బిడ్డ తండ్రి ఎవరో చెప్పకుండా రేవతి తికమతక సమాధానాలు చెబుతోందని పోలీసులు అంటున్నారు. బిడ్డకు ఎవరు తండ్రి అనే విషయం తెలుసుకోవడానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని అధికారులు కోర్టును ఆశ్రయించారు. అయితే మొదటి బిడ్డకు తండ్రి ఎవరో తెలిదు అని చెబుతున్న రేవతి ప్రస్తుతం గర్భవతి అని తెలుసుకున్న పోలీసులు ఇదెక్కడి రామాయణం రా దేవుడా అని తలలు పట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+