ప్రియుడి మీద దాడి చేసి ప్రియురాలి మీద గ్యాంగ్ రేప్: హడలిపోయిన మైసూరు నగరం !

బెంగళూరు: ప్రియుడి మీద దాడి చేసి అతని ముందే ప్రియురాలి మీద సామూహిక అత్యాచారం చేసిన ఘటన మైసూరు నగరంలో జరిగింది. సుమారు 6 మంది యువతి మీద అత్యాచారం చేశారని, భాదితురాలు, భాదితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.హెచ్.డి. కోటే హ్యాండ్ పోస్టుకు చెందిన యువతి మైసూరులోని కేజీ. కొప్ప ప్రాంతంలో నివాసం ఉంటున్నది.బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ప్రియుడితో కలిసి ఆమె మైసూరు నగరంలోని లింగాంబుధి చెరువు సమీపంలో ఏకాంతంగా ఉంది.

ఆ సమయంలో సుమారు 6 మంది యువకులు అక్కడికి వెళ్లారు. ప్రియుడి పట్టుకుని చితకబాదేశారు. తరువాత బండరాయి తీసుకుని ప్రియుడి కాలి మీద రాయి వేశారు. తరువాత ప్రియుడి తల మీద రాయితో దాడి చెయ్యడంతో అతను కుప్పకూలిపోయాడు. అనంతరం ప్రియురాలి మీద ఒకరి తరువాత ఒకరు సామూహిక అత్యాచం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.భాదితులు ఫిర్యాదు చెయ్యడంతో మైసూరు దక్షిణ విభాగంలోని జయపుర పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న మైసూరు ఎస్పీ అమిత్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భాదితురాలిని చెలువాంబ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

Young woman was gang raped in Mysuru in Karnataka

భాదితురాలు ప్రాణాలతో బయటపడిందని, 8 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్పీ అమిత్ సింగ్ తెలిపారు. ప్రియుడికి తీవ్రగాయాలు కావడంతో అతనికి చికిత్స చేయిస్తున్నారు. రాజస్తాన్ లోని అళ్వార్ ప్రాంతంలో జరిగిన గ్యాంగ్ రేప్ తరహాలో మైసూరులో గ్యాంగ్ రేప్ జరగడంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+