ఇంట్లోని మహిళపై గ్యాంగ్‌రేప్: వదినను నరికేసి సూసైడ్

Youth attacks sister-in-law, commits suicide
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాల పరంపర కొనసాగుతోంది. అధికార పార్టీకి చెందిన నాయకులే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై బాధ్యత రహితంగా వ్యవహరిస్తుండటంపై ఆ రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న అత్యాచారాలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరికొందరైతే తాము రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లిపోతామంటున్నారు.

రాష్ట్రంలోని సంభల్ జిల్లా అస్మౌలి ప్రాంతంలో ఓ 35ఏళ్ల మహిళపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శనివారం మీడియాకు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం బాధితురాలు సంభల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని చెప్పారు.

జూన్ 5న తన ఇంట్లో ఒంటరిగా ఉన్న తనపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి జావీర్ సింగ్ చెప్పారు.

కాగా, మరో ఘటనలో తన వదినపై గొడ్డలితో దాడి చేసిన యువకుడు, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాష్ట్రంలోని లలిత్‌పూర్ సమీపంలోని బన్‌పూర్ వద్ద జరిగింది. రామ్ సహాయ్(22)కి అతడి వదిన సరోజ్(24)తో శుక్రవారం గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురై గొడ్డలితో ఆమెపై దాడి చేశాడు.

ఆ తర్వాత భయంతో ఏదో విష పదార్థం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రామ్ సహాయ్‌ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తుండగా అక్కడే అతడు మరణించినట్లు పోలీసులు తెలిపారు. జరిగిన విషయాన్ని మరణించే ముందు రామ్ సహాయ్ పోలీసులకు చెప్పాడు. కాగా, తీవ్ర గాయాలపాలైన సరోజ్‌కు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం ఝాన్సీకి తరలించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+