అమ్మాయితో చాటింగ్... చితకబాదిన బంధువులు
విజయవాడ: ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయితో చాటింగ్ చేసిన యువకుడిని ఆమె బంధువులుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు కొట్టారు. కృష్ణా జిల్లా గొల్లపూడికి చెందిన శ్రీనివాస్ వారం రోజులుగా ఫేస్‌బుక్‌లో ఓ యువతితో చాటింగ్ చేస్తున్నాడు.
ఇందులో భాగంగా... ఈ రోజు కాలేజీ లేదు, విజయవాడ క్లబ్ సమీపంలోని ఎడ్వంచర్ వద్ద కలుసుకుందామా అని అతడు చాటింగులో కోరాడు. ఆమె సరేనని కూడా చెప్పిందని తెలుస్తోంది. దాంతో అతడు ఎడ్వంచర్ ప్రాంతం వద్ద చూస్తుండగా అక్కడకు వచ్చిన కొంతమంది అతడిని ఎత్తుకెళ్లి చితకబాదారు. అతడిన పొలంలో పడేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

రోడ్ ప్రమాదంలో 14 మందికి గాయాలు
ఆనంతపురం జిల్లా విడపనకల్ వద్ద బస్సు లారీ డీకొని 14 మందికి గాయలయాయి. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు.
స్కూల్ బస్సులు దహనం
శ్రీ పొట్టి నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో ఓ స్కూల్ బస్సులు దహనం చేసారు. గుర్తు తెలిఎని వ్యక్తులు ఈ బస్సులను దహనం చేసారు.
ఉరవకొండలో ఈతకెళ్లి ఒకరి అదృశ్యం
హెచ్చెల్సీ కాలువలో పడి ఒకరు అదృశ్యమయ్యారు. జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గం, రాయంపల్లి గ్రామ సమీపంలో ఉన్న హెచ్చెల్సీ కాలువలో ఈత కోసం దిగిన సురేష్(20) అనే యువకుడు అదృశ్యమైనట్లు స్థానికులు తెలిపారు.












Click it and Unblock the Notifications