వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral:వద్దురా అంటే వినకపోతివి..? ఇప్పుడు చూడు, రైలు నుంచి పడ్డ యువకుడు

|
Google Oneindia TeluguNews

ఇటీవల రైలు ఫుట్ బోర్డు మీద ఓ యువకుడు ఫోన్ చూస్తుండగా సెకన్లలో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి ఘటన ఒకటి జరిగింది. థెప్ట్ మాత్రం కాదు.. ఓ యువకుడే ఏకంగా పడిపోయాడు. ఘటన మహారాష్ట్రలో జరిగింది. అయితే అతను గాయపడ్డాడు. వెంటనే సమీపంలో గల ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అతనికి ప్రాణాపాయం ఏమీ లేదు.. కానీ తీవ్రంగానే గాయపడ్డారు. మిగతా వారు కూడా పడిపోయే ఛాన్స్ ఉండే.. కమరికొందరు పట్టుకోవడంతో వారు ప్రమాదానికి గురికాలేదు.

రైలు నుంచి పడి..

కల్వ- థానే స్టేషన్ మధ్య నడుస్తోన్న రైలులో యువత ఉన్నారు. అందులో అల్లరి బ్యాచ్ కూడా ఉంది. ఓ 18 ఏళ్ల యువకుడు ఫుట్ బోర్డ్ వద్ద ఉన్నాడు. ఆయనతోపాటు మిగతావారు కూడా ఉన్నారు. అయితే రైలు కల్వకు వచ్చిన సమయంలో.. యువకుడు పడిపోయాడు. రైలు నుంచి పట్టాల సమీపంలో పడిపోయాడు. తర్వాత మిగతావారు దిగి అతనిని పరిశీలించారు. గాయాలు కావడంతో కల్వ ఆస్పత్రికి తరలించారు. అతనికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు.

పట్టుకోవడంతో సేఫ్..

అతనితోపాటు మరికొందరు కూడా పడే అవకాశం ఉండేది. కానీ వారిని మిగతావారు పట్టుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. ఘటన గురించి తెలిసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రమాదానికి గల కారణంపై ఆరా తీస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఒక్కొక్కరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. ఇదేంటి ఇలా చేశావేంటి అని చాలా మంది అడుగుతున్నారు. మీ వల్ల మరికొందరు ఆకతాయిలు రెచ్చిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. సో.. మరోసారి ఇలా చేయొద్దు అని సూచించారు.

ఫుట్ బోర్డు వద్దంటే..


నిజానికి బస్సులు.. రైలులలో ఫుట్ బోర్డు ప్రయాణం చేయొద్దు అని నొత్తి నోరు బాదుకుంటున్నారు. పెద్ద పెద్ద అక్షరాలతో మరీ రాస్తారు. కానీ అయినా యువత వినిపించుకోదు. ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. సో.. జాగ్రత్తగా ఉండి.. మిగతా వారి గురించి కూడా కేర్ తీసుకోండి. లేదంటే ప్రమాదాలను కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. అవును.. ఫుట్ బోర్డు జర్నీ ఎంజాయ్ చేస్తూ.. ఇలా ప్రమాదానికి గురి కావాల్సి ఉంటుంది. అన్నీ సందర్భాల్లో కాకున్నా.. కొందరికీ తప్పవు.

English summary
18-year-old boy from Kalwa fell from a running train. boy was standing on the footsteps with few others. youth suffered injuries and admitted at a Kalwa hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X