వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సేలంలో ఆంధ్ర యువతిపై రేప్, పర్సు పడిపోయి..

By Pratap
|
Google Oneindia TeluguNews

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన యువతిపై కేరళలో అత్యాచారం జరిగింది. ఈ కేసులో కేరళ సూరమంగళం రైల్వే పోలీసులు ఓ యువకుడిని అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం కలుపల్లికి చెందిన ఏడుగురు యువతులు కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ వస్త్ర కర్మాగారంలో పనిచేస్తున్నారు.

కలువపల్లిలో జరిగే తిరునాల్లకు వారిని తీసుకుని వెళ్లేందుకు యువతుల బంధవులు వెళ్లారు. వారు కోయంబత్తూరు నుంచి బెంగళూర్ వెళ్లి అక్కడ నుంచి అనంతపురం రావడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. వీరంతా శనివారం రాత్రి కన్యాకుమారి నుంచి బెంగళూర్ వెళ్లే ఐల్యాండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు.

Youth Rapes Andhra Girl at Salem

రైలు రాత్రి ఏడు గంటల సమయంలో సేలం రైల్వే స్టేషన్‌కరు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిగ్నల్ వద్ద ఆగింది. ఆ సమయంలో ఏడుగురిలో ఓ యువతికి చెందిన పర్సు రైల్లోంచి కింద పడిపోయింది. దీంతో ఆమె కిందకు దిగింది. వెంటనే రైలు కదిలిపోయింది.

అదే రైల్లోని పక్క బోగీలో ప్రయాణిస్తున్న కేరళకు చెందిన హరి యువతి దిగడం చూసి అతడు కూడా దిగాడు. రైలు వెళ్లిపోవడంతో ఒంటరిగా ఉన్న యువతిని పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఈ ఘటనపై బాధితురాలు గేట్ కీపర్‌కు ఫిర్యాదు చేసింది. సూరమంగళం రైల్వే పోలీసులు హరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

నిందితుడు హరీష్ కేరళోని మాలాపురం ప్రాంతానికి చెందినవాడు. అతను తాగి ఉన్నట్లు చెబుతున్నారు. సహాయం చేస్తానని నమ్మించి ఆమెపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈలోగా తన కూతురు కనిపించకపోవడంతో యువతి తల్లి సేలం రైల్వే పోలీసులను ఆశ్రయించింది.

English summary
A ‘knight in shining armour’ who offered to help a ‘damsel in distress’ has been arrested for allegedly raping her. The incident occurred in the wee hours of Sunday after the 18-year-old girl had to get down from the Island Express when her handbag fell outside the train.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X