ప్రేయసి ఇంటికెళ్లి తుపాకీతో కాల్చుకొని ప్రియుడి ఆత్మహత్య
చండీగఢ్: ప్రియురాలు ఇంట్లో ఓ ప్రియుడు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని గంజి గులాబ్ సింగ్వాలా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. హరిశర్మ అనే యువకుడు, విర్పల్ కౌర్ అనే యువతి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు.
అయితే, తన ప్రేయసి విర్పల్ కౌర్ తల్లిదండ్రులు తమ పెళ్లికి ఒప్పుకోవడం లేదన్న విషయం తెలిసిన హరిశర్మ వారి ఇంటి వద్దకు వెళ్లి తనని తాను కాల్చుకుని చనిపోయాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఆత్మహత్యకు సంబంధించి విర్పల్ కౌర్ కుటుంబ సభ్యులైన బీంత్ సింగ్ (విర్పల్ కౌర్ తండ్రి), రమన్ దీప్ కౌర్ (తల్లి), సుఖీ (సోదరి)ల పైన కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు.
బెంగళూరులో ప్రత్యక్షమైన కామారెడ్డి బాలికలు
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఆదివారం నాడు అదృశ్యమైన ఇద్దరు బాలికల ఆచూకీ సోమవారం లభ్యమైంది. బెంగళూరు రైల్వే స్టేషన్‌లో రాగిణి, రాణి అనే ఈ ఇద్దరు బాలికలు పోలీసులకు దొరికారు. పోలీసుల సమాచారంతో బాలికల తల్లిదండ్రులు బెంగళూరు బయల్దేరారు. స్నేహితుల ఇంటికి వెళ్లి ఈ ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు.












Click it and Unblock the Notifications