దారుణం: జిమ్‌కు వెళుతున్న యువనేతను బైక్‌పై వచ్చి కాల్చి చంపారు
న్యూఢిల్లీ: సమాజ్ వాదీ పార్టీకి చెందిన యువనేతను ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. వివరాల్లోకి వెళితే ఘజియాబాద్ పరిధిలోని ఇందిరాపురం, వసుంధరా కాలనీలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.
గతంలో బహుజన సమాజ్ వాదీ పార్టీ తరుపున కౌన్సిలర్‌గా పనిచేసిన ప్రదీప్ చౌదరి... ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఈరోజు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో తన బైక్ పై మేవార్ కాలేజి సమీపంలో ఉన్న జిమ్‌కు వెళ్తున్న ప్రదీప్‌ను మరో బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్చారు.

ఆయన తలలోకి 8 బుల్లెట్లు దూసుకెళ్ళాయని ఎస్పీ శివహరి మీనా తెలిపారు. తీవ్రగాయాలైన ప్రదీప్‌ను దగ్గరలో ఉన్న నరేంద్ర మోహన్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ప్రాణాలు పోయాయని ఎస్పీ హరి మీనా వివరించారు.
హత్యాయత్నం, దోపిడీ తదితర 18 క్రిమినల్ కేసులలో నిందితుడిగా ఉన్న ప్రదీప్ చౌధరిపై వివిధ పోలీసుస్టేషన్లలో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రదీప్ చౌధరి సోదరుడు ప్రవీణ్ తెలిపిన దాని ప్రకారం మహేంద్ర పెహల్వాన్, నరేందర్ నూడల్‌తో పాటు మరో వ్యక్తిపై ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.
రాజేంద్ర నగర్‌లోని ఇండస్ట్రీయల్ ఏరియాలో ఉన్న 80 చదరపు అడుగుల స్ధల వివాదమే ప్రదీప్ ఛౌదరి మృతికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించామని.. విచారణ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications