వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ఫ్రెండే కదా..? మరేందుకు నేర్చుకోవడం లేదు, జగన్‌పై రఘురామ

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ లక్ష్యంగా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు విమర్శలు కొనసాగుతున్నాయి. ఏదో ఒక అంశంపై సీఎం లక్ష్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఇవాళ అప్పుల గురించి ప్రస్తావించారు. పనిలోపనిగా కేసీఆర్‌ను ఎందుకు ఆదర్శంగా తీసుకోవడం లేదని హితవు పలికారు. స్వపక్షంలోనే విపక్షంలా మారిన రఘురామపై వైసీపీ నేతలు కూడా కౌంటర్ వేస్తున్నారు.

అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ అనే వార్త ఆందోళన కలిగిస్తున్నాయని రఘురామకృష్ణరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ తీసుకున్న అప్పు ఏ రాష్ట్రం తీసుకోలేదని విమర్శించారు. అసలు రాష్ట్రం ఎందుకు ఇన్నీ అప్పులు చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. ఈ అప్పులను ఎలా తీరుస్తారని అడిగారు. అయితే పొరుగు రాష్ట్రం తెలంగాణ అప్పులు చేస్తున్నా.. అభివృద్ధిలో పురోగతి సాధిస్తున్నారని చెప్పారు. అదీ ఏపీ విషయంలో ఎందుకు జరగడం లేదన్నారు.

ysrcp rebel mp raghurama slams cm ys jagan

కేసీఆర్ మీతో స్నేహపూర్వకంగా ఉంటున్నారని.. మరీ ఆయనను చూసి ఎందుకు నేర్చుకోవడం లేదని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఇతరుల నుంచి మంచి తీసుకుంటే తప్పులేదన్నారు. దీంతో ఎన్నికలకు ముందు అమరావతి రాజధానికి సంబంధించి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలన్నారు. లేదంటే ప్రజలు తగిన బుద్దిచెబుతారని తెలిపారు.

రహదారులు దెబ్బతిని ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. హిందూ ధార్మిక సంస్థలు విరాళాలు ఇవ్వడంతో నిర్వహించే ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీకి క్రిస్టియన్‌ని ప్రిన్సిపల్‌గా నియమించవద్దని సూచించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దని కోరారు. అంతర్వేది రథం దగ్దం విషయంపై కూడా రఘురామ బహటంగానే విమర్శించిన సంగతి తెలిసిందే.

English summary
ysrcp rebel mp raghurama krishna raju slams cm ys jagan mohan reddy on andhra pradesh Debits
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X