Zero Shadow Day అంటే ఏంటి..? ఒడిషాలో ఆవిష్కృతమైన అద్భుత ఖగోళ దృగ్విషయం

వినీలాకాశంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్నిటిని కేవలం వినటమే తప్ప చూడలేము. మరికొన్ని కనిపిస్తాయి. అయితే వాటిని పలు జాగ్రత్త చర్యలు తీసుకుని నేరుగా కాకుండా టెలిస్కోప్ ఇతరత్రా పరికరాలను వినియోగించి చూడాల్సి ఉంటుంది. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, గ్రహాలు భూమికి దగ్గరగా రావడం, తోకచుక్కలు, ఉల్కలు, శకలాలు వంటివి ఇప్పటి వరకు చూశాం. తాజాగా ఆకాశం-భూమికి ముడిపడి ఉన్న ఓ అద్భుతం కూడా ఆవిష్కృతమైంది. అదే జీరో షాడో డే. అంటే నీడ అనేదే కనిపించదని అర్థం.

సాధారణంగా మన జీవితంలో నీడ అనేది ఒక భాగంగా ఉంటుంది. అయితే నీడ లేని జీవితం ఊహించుకోగలరా.. అసలు నీడ కనిపించదంటే నమ్ముతారా.. కానీ ఇక్కడ నమ్మాల్సిందే. ఇదే ఘటన ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో శుక్రవారం రోజు (మే 21వ తేదీ)ఆవిష్కృతమైంది. ఔను ఇది నిజం.. ఏటా రెండు సార్లు నీడ లేని రోజు వస్తుంది. దీన్నే జీరో షాడో డే అని పిలుస్తారు. భూమిపై ట్రాపిక్ ఆఫ్ కేన్సర్ (కర్కట రేఖ), ట్రాపిక్ ఆఫ్ కేప్రికార్న్ (మకర రేఖ) మధ్య ఏటా రెండు సార్లు ఈ జీరో షాడో డే వస్తుంది. ఈ ఘటన వివిధ ప్రాంతాల్లో వివిధ సమయాల్లో వివిధ తేదీల్లో కనిపిస్తుంది.

Zero Shadow Day 2021:Odisha witnessed this celestial wonder,what is it all about

ఉదాహరణకు భువనేశ్వర్‌లో శుక్రవారం రోజు (మే 21వ తేదీ) దర్శనమిచ్చిన జీరో షాడో డే మళ్లీ జూలై 22వ తేదీ ఉదయం 11గంటల53 నిమిషాలకు వస్తుంది. ఇక ఇదే అద్బుతం శనివారం అంటే మే 22వ తేదీన ఉదయం 11:43 నిమిషాలకు కనిపిస్తుంది. రెండో సారి తిరిగి జూలే 21 ఉదయం 11:53 నిమిషాలకు కనిపిస్తుంది. ఇక జీరో షాడో డే ఎలా ఆవిర్భవిస్తుందంటే... సూర్యుడు 90 డిగ్రీల కోణంలో భూమికి ఉంటే వస్తుంది. లేదా సూర్యుడు కచ్చితంగా మధ్యాకాశంలోకి వస్తే సంభవిస్తుంది. ఆ సమయంలో నీడ అనేది కనిపించదు. ఏ వ్యక్తి నీడ అయినా సరే, ఏ వస్తువు అయినా సరే దానికి సంబంధించిన నీడ మాయమవుతుంది.

భారత్‌లో కర్కట రేఖకు దక్షిణాన ఉన్న ప్రాంతాల్లో జీరో షాడో డే సంభవిస్తుంది. ఇది దక్షిణాయనం అంటే జూన్ 21 నుంచి డిసెంబర్ 22 మధ్య సూర్యుడు దక్షిణ దిశగా పయనించే సమయంలో సంభవిస్తుండగా... ఉత్తరాయణ సమయంలో అంటే డిసెంబర్ 22-జూన్ 21 వరకు సూర్యుడు ఉత్తర దిశకు పయనించే సమయంలో మరోమారు సంభిస్తుంది.సూర్యుడు ఆకాశంలో అత్యున్నత స్థానంకు చేరుకున్నప్పుడు ఈ జీరో షాడో డే కనిపిస్తుందని పటానీ సమంతా ప్లానెటోరియం డిప్యూటీ డైరెక్టర్ సుభేందు వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+