మొదటి,రెండో దశ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్... మూడో దశ ట్రయల్స్‌కు అనుమతి కోరిన జైదుస్...
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కి చెందిన ఫార్మా సంస్థ జైదుస్ క్యాడిలా అభివృద్ది చేస్తున్న కరోనా వ్యాక్సిన్ జైకోవ్-డి మొదటి,రెండో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో మూడో దశ ప్రయోగాల కోసం ఆ సంస్థ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది. మొత్తం 30వేల మందిపై మూడో దశ ప్రయోగాలను చేపట్టనుంది. ఈ మేరకు జైదుస్ క్యాడిల్ యాజమాన్యం ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది.
Recommended Video
మొదటి,రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో జైకోవ్-డి సంతృప్తికర ఫలితాలినిచ్చినట్లు జైదుస్ క్యాడిలా తెలిపింది. రెండో దశలో మొత్తం వెయ్యి మంది వలంటీర్లపై ట్రయల్స్ జరిపినట్లు పేర్కొంది. 'జైకోవ్ డి వ్యాక్సిన్ సురక్షితం,ఇమ్యూనోజెనిక్ అని నిర్దారించబడింది. క్లినికల్ ట్రయల్స్‌ను డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్(డీఎస్ఎంబీ) అనే స్వతంత్ర ఏజెన్సీ సమీక్షించింది. ఆ రిపోర్టులను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీవో)కి పంపించాం.' అని జైదుస్ క్యాడిలా తమ ప్రకటనలో వెల్లడించింది.

వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌పై కూడా తాము ఆశాజనకంగా ఉన్నామని.. అది కూడా పూర్తయితే వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని జైదుస్ క్యాడిలా ఛైర్మన్ పంకజ్ పటేల్ తెలిపారు.
ఒకే డీఎన్ఏ ఆధారిత సాంకేతికతతో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ది చేస్తున్నారు. ఇదే సాంకేతికతను గతంలో హెపటైటిస్ సీ కోసం కూడా ఉపయోగించారు. జైకోవ్ డి వ్యాక్సిన్‌ను గది ఉష్ణోగ్రతలోనే నిల్వ చేయవచ్చు. తద్వారా దేశంలోని ఏ ప్రాంతానికైనా వ్యాక్సిన్‌ను రవాణా చేయడం సులభతరమవుతుంది. ప్రత్యేకించి వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు ఎటువంటి కోల్డేజీ సదుపాయాలు అవసరం ఉండదు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం తర్వాతే జైదుస్ క్యాడిలా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. గత నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా జైదుస్ క్యాడిలా ప్లాంట్‌కు వెళ్లి వ్యాక్సిన్ తయారీని సమీక్షించిన సంగతి తెలిసిందే.
కాగా,యూకె,యూఎస్ అత్యవసర వినియోగానికి ఫైజర్ వ్యాక్సిన్‌కు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. రష్యా స్పుత్నిక్ వికి కొద్ది నెలల క్రితమే అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది. భారత్ మాత్రం ఇప్పటివరకూ ఏ వ్యాక్సిన్‌కు ఇంకా అనుమతునివ్వలేదు.












Click it and Unblock the Notifications