పుతిన్‌ను విమర్శిస్తే అంతేనా..: పదిమంది అనుమానాస్పద మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

మాస్కో: రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌ను విమర్శించిన వారి పని అంతేనా? ఆయనను విమర్శించిన వారు ఏదో ఒక హింసాత్మక ఘటనలోనో, అనుమానాస్పద పరిస్థితుల్లోనే మరణించినట్లు విమర్శలు వస్తున్నాయి.

తాజాగా ఉక్రెయిన్‌లో ఆశ్రయం కోరిన ఓ రష్యన్‌పై పట్టపగలు జరిగిన కాల్పుల ఘటన వెనక క్రెమ్లిన్‌ హస్తం ఉందనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. రష్యా కమ్యూనిస్టు పార్టీ మాజీ సభ్యుడిపై కీవ్‌ ఆఫ్‌ డెనిస్‌ వోరోనెంకోవ్‌లో జరిగిన కాల్పుల ఘటనను రష్యా ప్రభుత్వ ఉగ్రవాద చర్యగా ఉక్రెయిన్‌ అధ్యక్షులు పెట్రో పోరోషెంకో అభివర్ణించారు.

Not everyone who has a quarrel with President dies in violent or suspicious circumstances - far from it.

అయితే ఈ ఆరోపణలు అసంబద్ధమంటూ పుతిన్‌ అధికార ప్రతినిధి ఖండించారు. రాజకీయ వ్యతిరేకులను చంపడమనేది రష్యాలో పెరిగినట్లు తన భావన అని పార్లమెంటు మాజీ సభ్యులు, మాజీ భద్రతాధికారి గెన్నడీ గుడ్కోవ్‌ మాస్కో టైమ్స్‌తో వ్యాఖ్యానించారు.

పుతిన్‌ను విమర్శించిన తర్వాత అనుమానాస్పద రీతిలో మరణించిన వారిలో.. బోరిస్‌ నెమ్‌ట్సోవ్‌(2015), బోరిస్‌ బెరెజోవ్‌స్కీ(2013), స్టానిస్లావ్‌ మార్కెలోవ్‌, అంటాసియా బబురోవా(2009), సెర్గీ మ్యాగ్నిట్‌స్కీ(2009), నటాలియా ఎస్టెమిరోవా(2009), అన్నా పొలిటికోవాస్కాయ(2006), అలెగ్జాండర్‌ లిట్వినెంకో(2006), సెర్గీ యుషెంకోవ్‌(2003), యురి ష్చెకోకిఖిన్‌(2003)లు ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Not everyone who has a quarrel with President dies in violent or suspicious circumstances - far from it.
Please Wait while comments are loading...