ద్యావుడా.. ఫ్యూచర్ లో రైళ్లు ఇలా ఉంటాయా..? మైండ్ బ్లాక్ అంతే..

రైలు ప్రయాణాన్ని ఇష్టపడని వారుండరు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వెసులుబాటు రైళ్లలోనే ఉంది. ఇక భారత్ లో అయితే నిత్యం లక్షలాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. ఇక ఇప్పటికే భారతీయ రైల్వే వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. వందే భారత్ లాంటి రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అభివృద్ది చెందుతున్న రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

వీటిలో టాప్ ప్లేస్ లో వరల్డ్ క్లాస్ టెక్నాలజీని వినియోగించి జపాన్ SCMaglev అనే ఫ్యూచరిస్టిక్ రైలును అభివృద్ధి చేస్తోంది. ఈ రైలు గంటకు 600 కి.మీ. వేగాన్ని అధిగమించింది. ఈ రైలు సూపర్‌ కండక్టింగ్ అయస్కాంతాలను ఉపయోగించి ఇటీవల జరిపిన పరీక్షల్లో గంటకు 600 కి.మీ. పైగా వేగాన్ని అందుకుని ఆశ్చర్యపరిచింది. 2030 నాటికి జపాన్ లోని టోక్యో.. నగోయా నగరాల మధ్య ఈ రైలును అందుబాటులోకి తీసుకురానున్నారు. తద్వారా ఈ రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ఇక ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉంది. వర్జిన్ హైపర్‌ లూప్ లాంటి కంపెనీలు ఈ అధునాతన రైలు వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాయి.


అలాగే భారత్ రానున్న 18 నెలల్లో వందే భారత్ 4.0 రైళ్లను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ రైళ్ల గరిష్ట వేగం గంటకు 200 కి. మీ. గా ఉంది. ఎర్గోనామిక్ సీట్లు, మెరుగైన సౌకర్యాలతో పాటు సురక్షితమైన హై- స్పీడ్ ప్రయాణం కోసం స్వదేశీ కవచ్ ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థను ఈ అధునాతన రైళ్లలో అమర్చారు. ఇక చైనాకు చెందిన ఫుక్సింగ్ హావో రైళ్లు గంటకు 350 కి. మీ. వేగంతో ప్రయాణిస్తాయి. చైనాలోని ప్రధాన నగరాలైన బీజింగ్- షాంఘై మధ్య ఈ రైలు సేవలను అందిస్తోంది. అంతేకాక చైనాలోని మరో రైలు CRC Maglev గంటకు 400 కి. మీ. కంటే ఎక్కువ వేగంతో పరీక్షల్లో సత్తా చాటింది.

10 Futuristic Trains That Will Change Travel Forever

జపాన్ L0 సిరీస్ Maglev రైలు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో గంటకు 602 కి.మీ. వేగాన్ని అందుకుంది. అలాగే పోలాండ్‌ కు చెందిన NEVOMO ప్యాసివ్ మాగ్లెవ్ రైలు గంటకు 550 కి. మీ. వేగాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికాలో ఆమ్‌ ట్రాక్ సంస్థ ఫ్యూచరిస్టిక్ రైళ్లను అభివృద్ధి చేస్తోంది. ప్రయాణీకుల సౌకర్యం, పర్యావరణ స్థిరత్వంపై ఈ రైళ్లు దృష్టి సారించాయి. అమెరికాలో బ్రైట్‌ లైన్ 2 ప్రధాన నగరాలను గంటకు 240 కి. మీ. వేగంతో అనుసంధానించాలని లక్ష్యంగా ముందుకెళ్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+