మాల్దీవుల్లో ఫైర్ యాక్సిడెంట్.. 10 మంది మృతి, 8 మంది భారతీయ కార్మికులే
మాల్దీవుల్లో అగ్ని ప్రమాదం జరిగింది. క్యాపిటిల్ సిటీ మాలేలో గల భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 8 మంది భారతీయ కార్మికులు ఉన్నారు. ఆ బిల్డింగ్ లో 10 మంది విదేశీ కార్మికులు నివాసం ఉంటున్నారు.
ఆ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో గల గ్యారేజీలో ఉదయం మంటలు అంటుకున్నాయి. వేగంగా పై అంతస్థు వరకు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భవనం పై అంతస్థులో ఉన్న 10 మంది బయటకు రాలేకపోయారు. పొగ, మంట కారణంగా వారు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నారు. ఒకరు బంగ్లాదేశీ ఉన్నారు. మంటలను అదుపు చేసేందుకు నాలుగు గంటల సమయం పట్టిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

కింద ప్లోర్‌లో గల ఉన్న గ్యారేజ్ నుంచి మంటలు వచ్చినట్టు గుర్తించారు. ఆ మంటలు వేగంగా పై ప్లోర్‌కు వ్యాపించాయి. ప్రమాద ఘటనపై ఇండియన్ హై కమిషన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. మాల్దీవ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇటు సహాయం కోసం +9607361452, +9607790701 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ప్రమాదం దృష్ట్యా భవనంలో ఉన్న వారిని పక్కన గల స్టేడియంలో తరలించారు. ఇందుకోసం అక్కడ బస ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications