Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రపంచాన్ని బిత్తరపోయేలా చేసిన 102 ఏళ్ల వృద్ధుడు.. ఏం చేశారంటే ?

చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు ఎప్పుడూ కూడా తమ పనులతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఎప్పటికీ ఎన్నటికీ వెనుదిరగని మనస్తత్వం వారిలో ప్రధానంగా ఉంటుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఆ కోవ లోనే వయస్సుతో సంబంధం లేకుండా ఏదైనా సాధించవచ్చు అని నిరూపించారు జపాన్‌కు చెందిన 102 ఏళ్ల కొకిచి అకుజావా.

సాధారణంగా వందేళ్లు దాటిన తర్వాత నడవడం, ఇంట్లో చిన్న పనులు చేయడమే కష్టంగా ఉంటుంది. కానీ అకుజావా అందుకు భిన్నంగా, తన పట్టుదల, ఆత్మవిశ్వాసంతో అనుకున్నది చేసి చూపించారు. 3,776 మీటర్ల ఎత్తున్న మౌంట్ ఫుజిని అధిరోహించారు. అకుజావా సాధించిన ఈ అసాధారణ విజయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా గుర్తించింది. కాగా పర్వతాన్ని ఎక్కిన అత్యంత వృద్ధుడిగా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

102-year-old-kokiichi-akuzawa-made-guinness-record-by-climbing-mount-fuji

ఈ క్రమంలోనే అకుజావా.. తన పర్వతారోహణ ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటూ. ఎమోషనల్ అయ్యారు. మధ్యలో తాను పర్వతారోహణ ఆపేయాలని భావించానని తెలిపారు. అయితే చుట్టూ ఉన్నవారి ప్రోత్సాహం తనలో ఉన్న పట్టుదల.. 96 ఏళ్ల పర్వతాన్ని అధిరోహించిన అనుభవం ఆయనను ముందుకు నడిపించాయని స్పష్టం చేశారు. ఈ రికార్డుతో అకుజావా మనందరికీ ఒక స్పూర్తిదాయకమైన సందేశం ఇచ్చారనే చెప్పాలి.

అకుజావా గాథ కేవలం ఒక రికార్డు కాదని.. భవిష్యత్ తరాలకు ఒక జీవిత పాఠం అని అంటున్నారు. ఏ కలయినా వయసుతో సంబంధం లేకుండా సాధించవచ్చని.. విఫలమయ్యే భయం కన్నా ప్రయత్నించే ధైర్యం ముఖ్యమనీ సూచిస్తున్నారు. ఆరోగ్యం కాపాడుకుంటే శరీరం ఏ వయసులోనైనా మన కలలకు తోడ్పడుతుందంటున్నారు. వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని.. నిజమైన పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ లక్ష్యమైనా సాధించవచ్చు అని ఈ తరహా ఘటనలు మరోసారి రుజువు చేస్తున్నాయి.

102-year-old-kokiichi-akuzawa-made-guinness-record-by-climbing-mount-fuji

అకుజావా జీవితం ఏదైనా పనిని వయస్సు, లేదా ఇతర కారణాలను అడ్డం పెట్టుకుని వాయిదా వేసే వారికి ఒక కనువిప్పు అవుతుందని భావిస్తున్నారు. మనం ఎదుర్కొనే ప్రతి సవాలును అధిగమించడానికి ప్రేరణతో ముందుకు వెళ్తే విజయం మనదే అని గుర్తుచేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+