11 లక్షల ఏళ్లనాటి ఏనుగు అస్థిపంజరం

లాహోర్: భారీ ఏనుగులకు రెండు రెట్లు ఎక్కువగా ఉన్న ఏనుగు అస్థిపంజరం పాకిస్థాన్ లో బయటపడింది. 11.1 ఏళ్లనాటి ఈ అస్థిపంజరంపై పరిశోధనలు చేస్తున్నారు. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని గుజ్ రత్ జిల్లాలో ఈ అస్థిపంజరం బయటపడింది.

పాకిస్థాన్ యూనివర్శిటి పరిశోధకులు పబ్బిహిల్స్ ప్రాంతంలో గత ఏడాదిన్నరగా చేపట్టిన తవ్వకాల్లో వారం క్రితం ఆడ ఏనుగు అస్థిపంజరం బయటపడింది. ఈ అస్థిపంజరం 120 కిలోల బరువు, 38 సెం. మీ. పొడవు, 28 సెం.మీ. వెడల్పు ఉంది.

 11 lakh year-old skull of a elephant found in punjab in Pakistan

ఈ అస్థిపంజరం ఆసియా, ఆఫ్రికా, యూరప్ లో ఉండే ఏనుగుల జాతికి చెందినదని పాకిస్థాన్ లోని పంజాబ్ యూనివర్శిటి రీసెర్చ్ స్కాలర్ సయ్యద్ అబ్బాస్ అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఏనుగులకు రెండు రెట్లు ఎక్కువగా ఈ అస్థిపంజరం ఉందని, ఆనాటి ఏనుగుల గురించి తెలుసుకోవడానికి ఈ అస్థిపంజరం ఉపయోగ పడుతుందని ఆయన అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+