ఉక్రెయిన్‌లో రష్యాకు ఎదురుదెబ్బ : 11 వేల మంది సైనికులు హతం.. యుద్ధ విమానాలు కూల్చివేత !
ఉక్రెయిన్‌పై దాడుల్లో రష్యా ఏ మాత్రం తగ్గడం లేదు. మిస్సైల్స్, బాంబులతో విరుచుకుపడుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, జనావాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో దాడులకు దిగుతోంది. యుద్ధానికి ముగింపు పలకాలని ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నా.. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం మరింత దూకుడు పెంచారు. ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ రష్యా సేనలు ముందుకు సాగుతున్నాయి.
11వేల మంది సైనికులు హతం.. యుద్దవిమానాలు కూల్చివేత
అయితే.. రష్యా దళాల దాడులను ఉక్రెయిన్ తీవ్రంగానే ప్రతిఘటిస్తోంది. ఈ యుద్దంలో మాస్కోకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు 11వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ ఆర్మీ వెల్లడించింది. అంతే కాకుండా 44 యుద్ధ విమానాలు, 48 హెలికాప్టర్లను కూల్చివేసింది. అలాగే 295 యుద్ధ ట్యాంకర్లు, 109 ఆర్టీలరీలను నాశనం చేసినట్లు తెలిపింది. అటు 985 సాయుధ వాహనాలు, 447 మిలటరీ కార్లు, 60 ఇంధన వాహనాలు, 21 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వార్ పేర్ లు, 4 యూఏవీలను ధ్వంసం చేసినట్లు చెప్పింది. ఇంకా 50 క్షిపణి లాంచ్ వాహనాలతో పాటు రెండు బోటలను బాంబులతో పేల్చివేసినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది.

కీవ్‌పై పట్టుకోసం తీవ్ర ప్రయత్నాలు
అటు రష్యా సేనలు భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. ఖేర్సన్ నగరాన్ని రష్యా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. రెండు అణు విద్యుత్ కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు సముద్ర తీర ప్రాంతాలైన మరియుపోల్, వోల్నోవాఖ నగరాలను కూడా స్వాధీనం చేసుకునేందుకు సైన్యం చుట్టుముట్టాయి. అటు ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై దాడులు కొనసాగిస్తోంది. గత 11 రోజులుగా దీనిపై పట్టుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటించడం వల్లే ఇంకా ఈ కీవ్ నగరంపై రష్యా దళాలు పట్టుసాదించలేకపోతున్నాయి.

విన్నిట్సియా ఎయిర్ పోర్టు ద్వంసం
ఉక్రెయిన్‌పై పట్టు కోసం రష్యా సేనలు దాడులను ముమ్మరం చేశాయి. సెంట్రల్ వెస్ట్రన్ రీజియన్ రాజధాని అయిన విన్నిట్సియాలో విద్వంసం సృష్టిస్తోంది. ఇక్కడ ఉన్న ఎయిర్ పోర్టును రష్యా బలగాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. రష్యన్ ఆర్మీ రాకెట్లతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. ఆరోగ్యం కేంద్రంపై దాడులు చేసింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 11 మందికి గాయాలయ్యాయి. ఇది అంతర్జాతీయ మావవతా చట్టం ఉల్లంఘనేనని డబ్యూహెచ్వో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications