కువైట్‌లో ప్రమాదం: 15 మంది మృతి, మృతుల్లో అత్యధికులు భారతీయులే
కువైట్: కువైట్‌లో ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడ్డారు. రెండు బస్సులు ఢీకొనడంతో ఈ ఘోరం చోటు చేసుకొంది.
మరణించినవారిలో ఎక్కువగా భారతీయులే ఉన్నారని అధికారులు చెప్పారు. బుర్గాన్ , హెహిస్కో కంపెనీలకు చెందినవారుగా అధికారులు చెబుతున్నారు.

అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం వాటిల్లింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు.
ఈ ఘటనలో సుమారు నలుగురు కార్మికులు గాయపడ్డారు. కువైట్ కు సమీపంలోని ఏడవ రింగ్ రోడ్డు సమీపంలో ఈ రెండు బస్సులు ఢీకొన్నాయి. సంఘటనస్థలానికి అగ్నిమాపక యంత్రాలను పంపారు. సహయక చర్యలు చేపట్టారు.సంఘటనస్థలంలో రెస్కూ టీమ్ సహయక చర్యలను చేపట్టింది.












Click it and Unblock the Notifications