15 ఏళ్ల బాలికపై 29 రోజులు లైంగికదాడి, బతికుండగానే నరకం, ఈదుకుంటూ తప్పించుకొచ్చిన బాధితురాలు!

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూయార్క్‌: దాదాపు హాలీవుడ్‌ హర్రర్‌, సైకోటిక్‌ సినిమా కథను తలపించేలాంటి సంఘటన ఇది. ఓ పదిహేనేళ్ల బాలికకు ఎదురైన చేదు అనుభవం. దాదాపు జీవితకాలం మర్చిపోలేని దుర్ఘటన. ఒకటి కాదు రెండు ఏకంగా 29 రోజులు ఆ బాలిక బతికుండగానే నరకాన్ని చవి చూసింది.

మంచితనంగా ఇంటికొచ్చిన తెలిసినవాడు తీసుకెళ్లి మృగం కంటే దారుణంగా ప్రవర్తించిన తీరుకు అద్దం పడుతోంది ఈ ఘటన. అలెగ్జాండ్రియాకు చెందిన ఓ బాలిక(15)ను ఎత్తుకెళ్లి థామస్‌ బార్కర్‌ అనే వ్యక్తి దాదాపు నెల రోజులపాటు పాశవిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దుర్మార్గపు చర్యలో మరో ఇద్దరు కూడా పాలుపంచుకున్నారు.

కిడ్నాప్‌ ఇలా...

కిడ్నాప్‌ ఇలా...

ఆగస్టు 8న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో థామస్‌ బార్కర్‌ అనే వ్యక్తి అలెగ్జాండ్రియాలోని ఆ బాలిక ఇంటికొచ్చాడు. ఆమె కుటుంబ సభ్యులకు ఎలాంటి వివరాలు చెప్పకుండానే తన కొడుక్కు సహాయం చేసేందుకు రావాలని ఆమెను తన వెంట తీసుకెళ్లాడు. ఆ బాలిక చూడకుండా ఇంట్లో ఉన్న మొబైల్‌ ఫోన్‌ తీసి బయటికి విసిరి పారేశాడు. అతడు తమ కుటుంబానికి తెలిసిన వ్యక్తి కావడం, కొడుకు ఆపదలో ఉన్నాడని, సాయం కోసం పిలుస్తుండడంతో ఆ బాలిక కూడా అతడిని నమ్మింది. ఇంట్లో కూడా చెప్పకుండా అతడితో కలిసి బయటికి వెళ్లింది.

మొదలైన నరకం...

మొదలైన నరకం...

అలెగ్జాండ్రియా నుంచి తన కారులో ఆ బాలికను తీసుకెళ్లిన థామస్‌ నేరుగా కార్లోస్‌లోని ఓ మొబైల్‌ హౌస్‌లోకి తీసుకెళ్లాడు. వెంటనే ఆమెకు తుపాకీ పెట్టి బెదిరించి తన బెడ్‌ రూంలో కట్టి పడేశాడు. ఆ తర్వాత ప్రతి రోజు లైంగిక దాడికి పాల్పడటం మొదలుపెట్టాడు. జోష్‌వా హల్బీ అనే వ్యక్తి కూడా ఈ దురాగతంలో పంచుకున్నాడు. చెప్పకూడని విధంగా ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడుతూ కేవలం ఒక్కపూట మాత్రమే భోజనంపెడుతూ రాక్షసులకంటే దారుణంగా ప్రవర్తించారు.

చంపేందుకు ప్రయత్నం...

చంపేందుకు ప్రయత్నం...

రెండు మూడుసార్లు హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారు. బాతింగ్‌ టబ్లో ముంచి ఊపిరి ఆడకుండా చేయడం, గిలగిల కొట్టుకుంటుంటే చూసి ఆనందించడం, మెడకు ఉరి పెట్టి ఓ బకెట్‌పై నిలబెట్టి దానిని తన్నేసి ఊపిరికోసం గింజుకుంటుంటే ఆనందించడంలాంటివి చేశారు. ఇక సూదులతో గుచ్చడంలాంటివైతే లెక్కలేదు. అంత దారుణ పరిస్థితుల మధ్య నుంచి కూడా ఆ బాలిక ఎన్నోసార్లు అక్కడ్నించి తప్పించుకునేందుకు ప్రయత్నించింది.

ఇలా తప్పించుకుంది..

ఇలా తప్పించుకుంది..

నిజానికి ఆ బాలిక అలెగ్జాండ్రియాలో కనిపించకుండా పోయిన మూడు గంటలకే ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి గాలిస్తున్న పోలీసులు ఓసారి థామస్‌ బార్కర్‌ ఇంటి వద్ద కూడా తనిఖీ చేశారు. అయితే, వారికి అనుమానం రాకుండా వ్యవహరించిన థామస్‌, అతడి బృందం.. వెంటనే ఆ బాలికను అక్కడి నుంచి తప్పించి ఓ మొక్కజొన్న చేనులోకి తీసుకెళ్లారు. తినడానికి ఏదైనా తీసుకొద్దామని వారు బయటికి వెళ్లిన సమయంలో ఆ బాలిక ఎంతో సాహసం చేసి తప్పించుకోగలిగింది. నివాస ప్రాంతాలు కనిపించేంత వరకు పాపం.. పరుగెడుతూనే ఉంది.

కాపాడిన రైతు...

కాపాడిన రైతు...

మొక్కజొన్న పొలం నుంచి బయటపడిన ఆ బాలికకు కొంత దూరం పరిగెత్తాక ఓ 150 ఎకరాల వెడల్పుతో ఉన్న చెరువు కనిపించింది. దీంతో ఏ మాత్రం ఆలోచించకుండా అందులో దూకి ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకుంది. అదే సమయంలో మిన్నెసోటాకు చెందిన ఓ రైతు తన పొలంలో ఏదో ఎలుగుబంటి తిరుగుతుందనుకొని భ్రమపడుతూ భయంభయంగా దగ్గరికి వెళ్లి చూసి అవాక్కయ్యాడు. అప్పటికే ఆ బాలిక ఇంటినుంచి అదృశ్యమయి నెల రోజులు కావడంతో ఊరువాడలా ఆమె వివరాలు ఉన్న పోస్టర్లు వెలిశాయి. వాటిని అప్పటికే చూసిన ఉన్న ఆ రైతు ఆమెను గుర్తుపట్టాడు.

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు...

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు...

ముందు ఆమెకు దుస్తులు ఇచ్చి, తన వాహనంలో కూర్చోబెట్టుకొని పోలీసులకు ఫోన్‌ చేశాడు. దీంతో అక్కడికి చేరుకున్నపోలీసులు తొలుత బాలికన రెస్క్యూ హోంకు తరలించి అనంతరం ఆమె కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. తనను కిడ్నప్ చేసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులను సదరు బాలిక గుర్తు పట్టడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A kidnapped Minnesota teen bravely swam across a lake to safety from her abductors after nearly a month in captivity. Tean, 15, was reunited with her family this week after she disappeared from her Alexandria home in August, news station WCCO reported. Three men were arrested in connection to her disappearance. Police identified the suspects as Thomas Barker, 32, Joshua Holby, 31, and Steven Powers, 20. Authorities said the 15-year-old was acquainted with at least one of the suspects.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X