విషాదం : బొగ్గు గనిలో విష వాయువు లీక్... 16 మంది కార్మికులు మృతి...
చైనాలోని ఓ బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 16 మంది చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదవశాత్తు కన్వేయర్ బెల్టు కాలిపోయి భారీగా కార్బన్ మోనాక్సైడ్ విష వాయువు విడుదలవడంతో కార్మికులు గనిలోనే చిక్కుకుపోయి ఊపిరాడక చనిపోయారు. ఆదివారం సెప్టెంబర్ 27) తెల్లవారుజామున కిజియాంగ్ జిల్లాలోని సొంగ్‌జావ్ బొగ్గు గనిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది.
ప్రమాదంపై స్థానిక అధికారులు వీబో సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ప్రమాద కారణాలు ఇంకా తెలియరాలేదని... దానిపై విచారణ జరుగుతోందని చెప్పారు. నిజానికి చైనాలో గత కొన్నేళ్లుగా గని ప్రమాదాలు తీవ్రంగా పెరిగాయి. సరైన భద్రతా ప్రమాణాలు లేని కారణంగా గనుల్లో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

గత ఏడాది డిసెంబర్‌లో గుయిజౌ ప్రావిన్స్‌లోని ఓ బొగ్గు గనిలో గ్యాస్ లీకై పేలుడు సంభవించిన ఘటనలో 14 మంది మృతి చెందారు. డిసెంబర్,2108లోనూ చాంగ్‌కింగ్ పట్టణంలోని ఓ బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు చనిపోయారు.
Recommended Video
అదే ఏడాది అక్టోబర్‌లో షాండోంగ్ ప్రావిన్స్‌లోని ఓ బొగ్గు గనిలో చోటు చేసుకున్న ప్రమాదంలో 21 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. గనిలో మట్టిపెళ్లలు విరిగిపడి కార్మికులు అందులోనే చిక్కుకుపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కేవలం ఒక్క కార్మికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications