ఆతిథ్యమిచ్చి దారుణం: ఫ్రాన్స్ నుంచి అతిథిగా వచ్చిన విద్యార్థిపై అత్యాచారం

న్యూఢిల్లీ: చదువుకోవడం కోసం ఫ్రాన్స్ నుంచి వచ్చిన పదహారేళ్ల బాలికపై దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యాచారం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని ఓ ఇంట్లో విద్యార్థిని ఆతిథ్యం పొందింది. ఫ్రాన్స్ నుంచి వచ్చిన అమ్మాయి ఆతిథ్యం పొందింది తన స్నేహితురాలైన విద్యార్థి ఇంట్లోనే.

ఆతిథ్యం ఇచ్చిన విద్యార్థిని తండ్రి వ్యాపారవేత్త. కానీ అతను కూతురు వయస్సు ఉన్న ఫ్రాన్స్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను బాధించాడు. దీంతో ఫ్రాన్స్ నుంచి వచ్చిన అమ్మాయి షాక్‌కు గురైంది.

16 year old French exchange student raped by host family member

అక్టోబర్ 18వ తేదీన ఆమెపై నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎక్సేంజ్‌ ప్రొగ్రాంలో భాగంగా ఫ్రాన్స్‌కు చెందిన ఆ విద్యార్థిని భారత్‌కు వచ్చి శిక్షణ పొందుతోంది. జైపూర్‌కు వెళ్దామని ప్రయాణమవుతోన్న సమయంలో ఆమెపై అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

ఈ విషయాన్ని ఆమె తోటి విద్యార్థులకు చెప్పింది. వారు టీచర్లకు చెప్పారు. ఈ విషయం తెలిసి ఆ అమ్మాయికి మరో ఇంట్లో ఆతిథ్యం ఏర్పాటు చేశారు. నిందితుడిపై అక్టోబరు 23న ఫిర్యాదు అందింది. అప్పటి నుంచి అతను కనిపించడం లేదని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+