Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గాల్లోకి ఎగిరిన కాసేపటికే కుప్పకూలిన విమానం: 19 మంది మృతి

మాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. తేలికపాటి విమానం కుప్పకూలడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో మొత్తం 23 మంది ఉన్నారు. తతర్‌స్థాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

రష్యాకు చెందిన ఎల్-410 తేలికపాటి విమానం 21 మంది స్కైడైవింగ్ సభ్యులు, ఇద్దరు సిబ్బందితో బయల్దేరింది. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన మెన్సెలిన్క్స్ పట్టణం సమీపంలో చోటుచేసుకుంది. విమానం ఈ ప్రమాదంలో రెండు ముక్కలుగా విరిగిపోయింది.

19 Feared Dead After Plane Crashes In Russia

ప్రమాదానికి ముందు ఈ విమానం రాడార్ల నుంచి అదృశ్యమైంది. ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో ప్రమాదం వెలుగుచూసింది. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను విమాన శిథిలాల నుంచి బయటకి తీసి ఆస్పత్రులకు తరలించారు.

Recommended Video

    Air India Plane Stucked Under Bridge At Delhi Gurgav Highway || Oneindia Telugu

    ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. ఆర్మీ, నేవీలకు స్వచ్ఛందంగా సేవలు అందించే ఓ స్పోర్ట్స్, డిఫెన్స్ సంస్థకు చెందినదిగా ఈ విమానాన్ని గుర్తించారు. ఈ ఏడాది మొదట్లోనూ పలు ఎల్-410 విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయని అధికారులు తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+