వాలంటైన్స్‌డే రోజునే పెళ్ళి: కొన్ని గంటల్లోనే భార్య మృతి
టెక్సాస్: ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాడు. ప్రేమికుల రోజునే పెళ్ళి చేసుకొన్నారు. పెళ్ళైన కొద్ది గంటల్లోనే తన చేతుల్లోనే భార్య మరణిండంతో ఆ భర్త కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రేమికుల రోజున సంతోషంగా గడపాల్సిన ఆ ప్రేమికుడికి జీవితాంతం ఆ ఘటన గుర్తుండే ఉంటుంది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకొంది.
ప్రేమికులు వాలంటైన్స్ డే కోసం ఎదురు చూస్తుంటారు ఆ రోజు కోసం సంవత్సరం పాటు చూస్తారు ఏడాది పాటు గుర్తుండేలా ఆ రోజు గడపాలని ప్లాన్ చేస్తారు. అయితే అమెరికాలో ఓ జంటకు మాత్రం ఈ ఏడాది వాలంటైన్స్ డే తీవ్ర విషాదాన్ని నింపింది.
ప్రేమికుల రోజునే ప్రేమించి పెళ్ళి చేసుకొన్న భార్యను కోల్పోవడం ఆ భర్తను తీవ్ర నిరాశలో ముంచెత్తింది. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరి 14న, చోటు చేసుకొంది.

సోషల్ మీడియా ద్వారా ప్రేమలోకి
అమెరికాకు చెందిన లిదియా డొమింగుజ్ అనే 19 ఏళ్ల యువతి సోషల్ మీడియా ద్వారా జోషువా ఓర్టొనెజ్ అనే 21 సంవత్సరాల యువకుడితో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల పాటు వీరి పరిచయం ప్రేమగా మారింది. అయితే అతను ఆ విషయాన్ని ఆమెకు చెప్పలేదు.

క్యాన్సర్ బారిన పడిన ప్రియురాలు
తన ప్రియురాలు లిదియా డొమింగుజ్ క్యాన్సర్ బారిన పడిన విషయం ప్రియుడికి తెలిసింది . ఈ విషయాన్ని పక్కన పెట్టి ఆమెను ప్రేమిస్తున్నాడు. అయితే కిడ్నీ క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రియురాలు లిదియా డొమింగుజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే ఆసుపత్రికి వెళ్ళి ఆమెను పరామర్శించి తన ప్రేమను ఆమెకు చెప్పాడు.

వాలంటైన్స్ డే రోజునే పెళ్ళి
ఆసుపత్రిలో లిదియా డొమింగుజ్ కు తన ప్రేమ విషయాన్ని చెప్పిన నాలుగు గంటల్లోనే ఇద్దరి కుటుంబసభ్యుల సమక్షంలోనే ఆసుపత్రిలోనే వివాహం జరిగింది.ఆసుపత్రిలోనే బెడ్‌పై ఉన్న ప్రియురాలని ప్రియుడు వివాహం చేసుకొన్నాడు. వాలంటైన్స్ డే రోజు వివాహం చేసుకోవడంతో ఆ జంట ఆనందం ఎక్కువసేపు నిలువ లేదు.

పెళ్ళైన కొద్ది గంటల్లోనే మృతి
లిదియా డొమింగుజ్ పెళ్ళైన కొద్ది గంటల్లోనే మరణించింది. చనిపోయే ముందు ఆ దంపతులు ఓ టీవి చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.‘లిదియాకు కేన్సర్ అని తెలుసు.. కానీ నా ప్రేమ ఆమెకు ఉన్నరోగాన్ని గెలుస్తుందన్న నమ్మకం ఉందన్నారు జోషువా. ప్రేమించిన వ్యక్తి తోడుగా ఉంటే దేన్నైనా గెలవచ్చనే ఆశ ఉందని లిదియా ఆశాభావం వ్యక్తం చేసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications