అమెరికాలో మళ్లీ కాల్పులు.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు

వాషింగ్టన్: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. న్యూఓర్లీన్స్‌లోని లోవర్ 9 వార్డులో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో ఇద్దరు మరణించారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

సెయింట్ క్లాడ్ ఎవెన్యూ 5100 బ్లాక్ సమీపంలోని పెట్రోల్ పంపు పక్కన ఆగి ఉన్న కారులో ఓ మృతదేహాన్ని గుర్తించారు. సంఘటనకు ముందు కొందరు వ్యక్తులు అక్కడ ఘర్షణ పడినట్టు స్థానికులు పేర్కొన్నారు.

2 dead, 3 wounded in Lower 9th Ward shooting, New Orleans police say

అయితే వారెందుకు ఘర్షణ పడ్డారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని, దాడికి పాల్పడిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా... మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు.

ఈ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+