అమెరికా స్కూల్లో విద్యార్థి కాల్పులు: ఇద్దరు మృతి

 2 dead, 4 wounded after student opens fire at Washington state school
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ హైస్కూల్లో గల కేఫ్‌టేరియాలో ఓ విద్యార్థి కాల్పులకు తెగబడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ కాల్పుల్లో అతని క్లాస్‌మేట్ అక్కడికక్కడే మరణించాడు. నలుగురు గాయపడ్డారు. విద్యార్థులు గందరగోళం సృష్టించిన నేపథ్యంలో ఆ విద్యార్థి తన ప్రాణాలు కూడా తీసుకున్నాడు.

మేరీస్‌విల్లేపి్చుక్ హైస్కూల్లో జరిగిన ఈ కాల్పుల ఘటన బాధితులంతా పిల్లలే. ముగ్గురి తలలకు గాయాలయ్యాయి. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నాలుగో బాధితుడు స్వల్పంగానే గాయపడ్డాడు. అతన్ని సియాటిల్‌లోని హర్బోర్‌వ్యూ సెంటర్‌కు తరలించారు. గాయపడినవారిలో ఇద్దరు యువకులు కాగా, ఇద్దరు యువతులు.

ఇద్దరు మరణించినట్లు తమకు సమాచారం ఉందని మేరీస్‌విల్లే పోలీసు కమాండర్ రోబ్ లామౌరెయుక్స్ చెప్పారు. మేరీస్‌విల్లే సియాటల్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. షూటర్ తనను కాల్చుకుని మరణించాడని అధికార వర్గాలు చెప్పాయి. అతను కాల్పులకు తెగబడడానికి కారణం ఏమిటనేది తెలియదని అధికారులు అంటున్నారు.

దాడి చేసిన విద్యార్థి రెజ్లింగ్, ఫుట్‌బాల్ జట్లలో సభ్యుడని చెప్పారు. ఆ విద్యార్థి లంచ్ సమయంలో కేఫ్‌టేరియాలోకి ప్రవేశించి తన తరగతి విద్యార్థులపై కాల్పులు జరిపాడని వారన్నారు. అతను వెనక నుంచి వచ్చి ఎనిమిది బుల్లెట్లను కాల్చాడని, వారి వెనక వైవు నుంచి అతను కాల్పులు జరిపాడని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+