వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెమిస్ట్రీలో ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు నోబెల్ ప్రైజ్

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

స్టాక్ హోం: 2016 సంవత్సరానికి గాను రసాయనశాస్త్రంలో ముగ్గురు శాస్త్ర‌వేత్త‌ల‌కు నోబెల్ ప్రైజ్ లభించింది. అతి సూక్ష్మ యంత్రాల‌ను త‌యారు చేసిన జీన్ పెర్రీ సావేజ్‌, స‌ర్ జే ఫ్రేజ‌ర్ స్టొడార్ట్‌, బెర్నార్డ్ ఫెరింగాలకు ఈ ఏడాది కెమిస్ట్రీలో నోబెబ్ బహుమతి దక్కింది.

భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌ ప్రైజ్ ఈ ముగ్గురు కూడా మానవ శరీరంలోని నానో మిషన్లపై అధ్యయనం చేశారు. ప్రపంచంలోనే అత్యంత బుల్లి యంత్రాలను వీరు డిజైన్ చేసి వివిధ రకాల కాంపొనెంట్స్‌తో అమర్చారు. దీంతో పాటు ఆ ప‌ర‌మాణువులు చేసే సంశ్లేష‌ణ అంశాన్ని కూడా వీళ్లు విశ‌దీక‌రించారు.

2016 Nobel Prize in chemistry awarded for molecular machines

మానవ శరీరంలోని సూక్ష్మ యంత్రాల‌ను రూపొందించిన ఈ ముగ్గురూ ర‌సాయ‌నిక శాస్త్రాన్ని తారాస్థాయికి తీసుకెళ్లార‌ని స్టాక్‌హోమ్‌లోని నోబెల్ క‌మిటీ ప్ర‌క‌టించింది. పారిస్‌లో పుట్టిన ప్రొఫెస‌ర్ జీన్ పెర్రీ సావేజ్‌ ప్ర‌స్తుతం యూనివ‌ర్సిటీ ఆఫ్ స్ట్రాట్స్‌బ‌ర్గ్‌లో ప‌నిచేస్తున్నారు.

ఫ్రెంచ్ నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సైంటిఫిక్ రీస‌ర్చ్ డైర‌క్ట‌ర్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక ఎడిన్‌బ‌ర్గ్‌లో జ‌న్మించిన స‌ర్ జే ఫ్రేజ‌ర్ స్టొడార్ట్‌ అమెరికాలోని నార్త్‌వెస్ట్ర‌న్ వ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్‌గా చేస్తున్నారు. మ‌రో శాస్త్ర‌వేత్త బెర్నార్డ్ ఫెరింగా 1951లో నెద‌ర్లాండ్స్‌లో పుట్టారు. యూనివ‌ర్సిటీ ఆఫ్ గ్రోనింజ‌న్‌లో ఆయ‌న కెమెస్ట్రీ ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

English summary
Jean-Pierre Sauvage, Sir. James Fraser Stoddart and Bernard Feringa were awarded the 2016 Nobel Prize in chemistry on Wednesday for their work on molecular machines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X