2018 నోబెల్ బహుమతులు: క్యాన్సర్‌పై పరిశోధనలకుగాను జేమ్స్, హోంజోలకు నోబెల్
Recommended Video

స్వీడన్: వైద్య శాస్త్రంలో ఇద్దరిని నోబెల్ పురస్కారం వరించింది. అమెరికాకు చెందిన జేమ్స్ పీ అలిసన్, జపాన్‌కు చెందిన తసుకు హోంజోలకు ఈ అవార్డు లభించింది. క్యాన్సర్ థెరపీలో ఆవిష్కరణలకు గాను వీరికి అత్యున్నత పురస్కారం దక్కింది.
క్యాన్సర్ చికిత్సలో చెక్ పాయింట్ థెరఫీని కనుగొన్నందుకు నోబెల్ అసెంబ్లీ ఆఫ్ ది కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్ వీరిని ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. వీరికి పది లక్షల డాలర్ల నగదు బహుమతిని అందజేస్తారు.

తసుకు హోంజో క్యాన్సర్ ఇమ్యునోథెరపీపై పరిశోధలు చేస్తున్నారు. జేమ్స్ పీ అల్లిసన్.. ఎండీ అండర్సన్ క్యాన్సర్ సెంటర్లో ప్రొపెసర్‌గా, ఇమ్యునాలజీ విభాగాధిపతిగా ఉన్నారు. ఇమ్యునోథెరఫీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గాను ఉన్నారు.
ప్రతి సంవత్సరం మెడిసిన్ విభాగంలో తొలి నోబెల్ బహుమతిని ప్రకటిస్తారు. డైనమెట్ రూపకల్పన చేసిన ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట దీనిని అందిస్తున్నారు. మంగళవారం ఫిజిక్స్, బుధవారం కెమస్ట్రీ బహుమతులను ప్రకటిస్తారు. శుక్రవారం నోబెల్ శాంతిబహుమతి ప్రకటిస్తారు. మంగళవారం స్వీడన్లో ఆర్థిక శాస్త్రం నోబెల్ పురస్కారాన్ని ప్రకటిస్తారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications