ఆప్ఘనిస్తాన్‌లో మళ్లీ ఉగ్రదాడి.. 22 మంది దుర్మరణం, 50 మందికిపైగా గాయాలు

ఆప్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. హెల్మండ్‌ ప్రావిన్స్ లో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 22 మంది మృతి చెందగా మరో 50 మందికి పైగా గాయపడ్డారు.

హెల్మండ్‌ : ఆప్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. హెల్మండ్‌ ప్రావిన్స్ లో గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 22 మంది మృతి చెందగా మరో 50 మందికి పైగా గాయపడ్డారు.

హెల్మండ్‌ ప్రావిన్స్ రాజధాని లోని లష్కర్‌ బాగ్‌లోని న్యూ కాబూల్ బ్యాంకు ఎదుట ఈ దారుణం చోటు చేసుకుంది. సాయుధులైన ఉగ్రవాదులు కాబూల్ బ్యాంక్ ఎదుట ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.

kabul-blast

దీంతో ఒక్క సారిగా ఆ ప్రాంతం పేలుళ్ల మోతలతో దద్దరిల్లిపోయింది. ఈ దుర్ఘటనలో రెండు డజన్ల మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎమర్జెన్సీ హాస్పిటల్ కు తరలించారు.

అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. తాలిబన్లకు చెందిన ఏ టెర్రరిస్టు గ్రూపు ఈ దాడికి పాల్పడిందో ఇప్పటి వరకు తెలియరాలేదు. క్షతగాత్రుల్లో సాధారణ పౌరులతోపాటు సైనికులు కూడా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+