ఒమన్‌లో వేదఘోష: సుల్తాన్ కోసం రుత్విక్కుల యాగం
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరుకు చెందిన జ్యోతిష్కుడు చంద్రశేఖర స్వామి ఆధ్వర్యంలో పలువురు రుత్విక్కులు ఒమన్ దేశానికి వెళ్లారు. పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఒమన్ సుల్తాన్ కోసం వారు హోమం చేస్తున్నారు. దీంతో, ఎడారి దేశమైన ఒమన్‌లోని బర్ఖా పట్టణం వేద ఘోషలతో ప్రతిధ్వనిస్తోంది. ఇస్లాం రాజ్యంగా పేరున్న ఈ దేశంలో భారత సనాతన వేదం వినిపిస్తోంది.
అనారోగ్యంతో బాధపడుతున్న ఒమన్ సుల్తాన్‌కు స్వస్థత చేకూర్చేందుకు కర్ణాటక బ్రాహ్మణులు బ్రహాండమైన హోమం నిర్వహిస్తున్నారు. బెంగళూరుకు చెందిన ప్రముఖ జ్యోతిషుడు చంద్రశేఖర్ స్వామి ఆధ్వర్యంలో మంగళూరులోని పూర్ణ విద్యాపీఠానికి చెందిన 22 మంది రుత్విజుల బృందం గతవారం మస్కట్‌కు తరలివెళ్లింది.

వీరంతా సుల్తాన్ అతిథుల హోదాలో మస్కట్‌కు సమీపంలోని బర్ఖా పట్టణంలో ఈ హోమాన్ని నిర్వహిస్తున్నారు. దీని కోసం అక్కడ శాస్త్రోక్తంగా ఓ పెద్ద యాగశాలను నిర్మించారు. సుల్తాన్ సలహాదారుగా పని చేస్తున్న ఓ గుజరాతీ ఆధ్వర్యంలో ఈ హోమం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
బర్ఖాలో ఈ బృందం మహా ధన్వంతరి యాగం, నవగ్రహ శాంతి హోమం, మహా మృత్యుంజయ యాగం , మహావిష్ణు యాగాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రతువు నిర్వహించినందుకు ఈ బృందానికి రానుపోనూ ఖర్చులతో పాటు దక్షిణగా సుమారు రూ.30 లక్షలు ఇవ్వనున్నారు.
72 ఏళ్ల ఒమన్ సుల్తాన్ క్వబూస్ బిన్ కొంతకాలంగా పెద్దపేగు కేన్సర్‌తో బాధ పడుతున్నారు. ఈ యాగం వల్ల రాజు ఆరోగ్యం మెరుగుపడగలదని దీనికి హాజరైన పలువురు అశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలలుగా జర్మనీలో చికిత్స పొందుతున్న సుల్తాన్ ఆరోగ్యం కోసం గత జులైలో కర్ణాటకలోని హోసనాడులో చండీయాగాన్ని నిర్వహించారు. యాగకర్త చంద్రశేఖర స్వామికి మంచి పేరు ఉంది.












Click it and Unblock the Notifications