చైనాలో వరద బీభత్సం: 225 మంది మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్: చైనాలో వరద బీభత్సానికి 225 మంది వరకు మృతి చెందారు. లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

వరదల గురించి ప్రభుత్వం ముందుగా హెచ్చరించకపోవడం, సరైన సహాయక చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వరదల కారణంగా ఇళ్లు నీటమునిగాయి. సుమారు 3.10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండచరియలు విరిగిపడటంతో 52 వేల ఇళ్లు ధ్వంసం అయ్యాయి.

 చైనా వరదలు

చైనా వరదలు

1.6 లక్షల ఇళ్లు దెబ్బతిన్నాయి. సుమారు ఏడు లక్షల హెక్టార్‌లలో పంట దెబ్బతిన్నది. దాదాపు 6.80 లక్షల మంది పైన వరదల ప్రభావం పడింది. మరో రెండున్నర లక్షల మంది ఇంకా వరదల్లోనే చిక్కుకున్నారు.

చైనా వరదలు

చైనా వరదలు

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 500 మంది సైనికులు, వెయ్యి మందికి పైగా ప్రజలు, 62 స్పీడ్ బోట్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

చైనా వరదలు

చైనా వరదలు

ఈ ప్రమాదంలో 114 మంది చనిపోయారని, 111 మంది గల్లంతయ్యారని చెబుతున్నారు. గల్లంతైన వారు కూడా మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు.

 చైనా వరదలు

చైనా వరదలు

52,900 ఇల్లు కూలిపోయాయి. 155,000 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఏడు లక్షలకు పైగా హెక్టార్లలో పంట నష్టం జరిగింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As many as 225 people have been killed or missing in heavy torrential rains and floods that have wreaked havoc in China with about 2.5 lakh people still trapped in the central Hubei Province.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X