• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా వైరస్‌పై షాకింగ్ న్యూస్.. కోలుకోకముందే చైనాలో 2nd wave..

|

కరోనా వైరస్.. మూడు నెలలుగా ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతోన్న మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి సోకిన ఈ వైరస్.. ఇప్పటిదాకా 45వేల మందిని బలితీసుకుంది. దేశాలన్నీ స్తంభించినవేళ.. క్రిటికల్ కేసుల సంఖ్య వేలల్లో ఉండటం, దీనికింకా మందు అందుబాటులోకి రాకపోవడంతో జనం అల్లాడుతున్నారు. మొదటి తాకిడిలోనే భారీ విలయాన్ని సృష్టించిన కరోనా.. రెండో సారి కూడా మానవాళిపై దాడికి సిద్ధమవుతున్నట్లు చైనా ప్రభుత్వం అంచనా వేస్తున్నది. కరోనా 2nd wave(రెండో దశ)గా పిలుస్తోన్న ఈ వ్యవహారం అందరికీ షాకిస్తున్నది.

లాక్ డౌన్ ఎత్తివేతతో..

లాక్ డౌన్ ఎత్తివేతతో..

సెంట్రల్ చైనాలోని హుబె ఫ్రావిన్స్ రాజధాని వూహాన్ సిటీలో కరోనా వైరస్ పుట్టిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 1న అక్కడ మొదటి కేసు నమోదైంది. తక్కువకాలంలో వేగంగా వ్యాపిస్తూ, ప్రపంచ దేశాలనూ కబళించింది. లాక్ డౌన్ కఠినంగా అమలు చేయడంతో వైరస్ వ్యాప్తి ఆగిపోయింది జిన్ పింగ్ ప్రభుత్వం ప్రకటించింది. మార్చి చివరి వారం నుంచే హుబే ఫ్రావిన్స్ లో లాక్ డౌన్ నిబంధనలు ఎత్తేసింది. ముందు జాగ్రత్తలో భాగంగా ఆ ఒక్కరాష్ట్రంలోనే సుమారు 25 వైద్య బృందాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా ఆరోగ్యంగా కొనసాగుతున్నవాళ్లతోపాటు కొవిడ్-19 నుంచి కోలుకున్నవాళ్లపైనా కన్నేసి ఉంచిన డాక్టర్లకు ఈమధ్యే ఓ షాకింగ్ విషయం తెలిసింది.

అసలేంటిదంతా?

అసలేంటిదంతా?

కరోనా వైరస్ సోకితే ప్రధానంగా జ్వరం, పొడి దగ్గు లక్షణాలు బయటపడతాయి. కొన్ని కేసుల్లో తలనొప్పి, నీళ్ల విరేచనాలు, వాంతులు చేసుకోవడం లాంటివి కూడా ఉంటాయి. అయితే ఇలాంటి లక్షణాలకు గురికాకుండానే జనం వైరస్ బారినపడుతుండటాన్ని చైనీస్ డాక్టర్లు గుర్తించారు. ఇలా లక్షణాలు బటపడనివాటిని అసింప్టమాటిక్ కేసులుగా భావిస్తారు. బుధవారం నాటికి ఈ తరహా కేసుల సంఖ్య 1551గా నమోదైంది.

అన్నీ కొత్త కేసులే..

అన్నీ కొత్త కేసులే..

ఇక్కడమనమో క్లారిటీ తీసుకోవాలి.. కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకుని, నెగటివ్ గా బయటపడ్డ పేషెంట్ల ఒంట్లో చాలా కాలం పాటు వైరస్ ఉంటుందందని, తర్వాత టెస్టులు చేసినప్పటికీ పాజిటివ్ గా చూపించదని కొన్ని రిపోర్టులు వచ్చాయి. కానీ మనం చెప్పుకుంటున్న అసింప్టమాటిక్ కేసులు పూర్తిగా కొత్తవాళ్లకు సోకుతున్నదే కావడం గమనార్హం.

అధికారిక ప్రకటన..

అధికారిక ప్రకటన..

లక్షణాలు లేకుండానే పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడాన్ని చైనీస్ డాక్టర్లు కరోనా 2nd wave అని పిలుస్తున్నారు. దీనికి సంబంధించి తర్జనభర్జనల తర్వాత చైనా నేషనల్ హెల్త్ కమిషన్(ఎన్‌హెచ్‌సీ) తొలిసారిగా అధికారికంగా స్పందించింది. దేశంలో అసింప్టమాటిక్ కేసుల సంఖ్య పెరుగుతున్నదని, బుధవారం నాటికి 1541గా నమోదయ్యాయని, వాళ్లందరినీ అబ్జర్వేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నామని ఎన్‌హెచ్‌సీ పేర్కొంది.

  IPL 2020 : BCCI Plans To Schedule August-September Window For IPL
  చైనాలో సీన్ ఇది..

  చైనాలో సీన్ ఇది..

  కరోనా పుట్టినిల్లు చైనాలో బుధవారం నాటికి కూడా 81.554 మంది పాజిటివ్ పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. అయితే కొత్త కేసుల నమోదు మాత్రం గణనీయంగా పడిపోయింది. బుధవారం కేవలం 36 కొత్త కేసులే వచ్చాయి. ఇప్పటిదాకా మొత్తం 3.312 మంది చనిపోయారు. నిజానికి అసింప్టమాటిక్ కేసుల విషయంలో మొదటి నుంచీ గోప్యత పాటించిన చైనా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర దేశాల ఒత్తిడిమేరకు ఎట్టకేలకు వాటి వివరాల్ని కరోనా 2nd wave పేరుతో విడుదల చేసింది.

  English summary
  For the first time since the COVID-19 outbreak, China on Wednesday revealed the presence of 1,541 asymptomatic cases carrying the deadly novel coronavirus, raising concerns of a second wave of infections amid the relaxation of stringent measures in the country initiated to contain the deadly disease.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more