యెమెన్‌లో కారు బాంబు పేలుడు: 30 మంది మృతి
న్యూఢిల్లీ: యెమెన్ దేశ రాజధాని సనాలో ఉగ్రవాదులు కారు బాంబును పేల్చారు. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా... 50 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
సనాలోని స్ధానిక పోలీసు కళాశాల ఎదుట ఈ సంఘటన జరిగింది. ఇది ఇలా ఉంటే ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్ధా ప్రకటించుకోలేదు. ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
BREAKING NEWS: At least 40 killed including 15 children in Sanaa Yemen as bomb explodes near police academy. pic.twitter.com/b1a8TRvFwX
— JL News Alert (@JLNewsAlert) January 7, 2015 ఈ ఘటనలో గాయపడ్డ వారిని అంబులెన్స్ ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆల్‌ఖైదా తన కార్యకలాపాలను వేగవంతం చేసి ఉగ్రవాద దాడులకు పాల్పడుతుందని యెమెన్ హోం మంత్రి ఆరోపణలు చేశారు.
Dozens of high school graduates killed&injured by car bombing at gate of police academy Sanaa Yemen now. pic.twitter.com/XroO82tJgM
— Nasser Arrabyee (@narrabyee) January 7, 2015 గత వారం యెమెన్‌లోని సౌత్ వెస్ట్ కల్చరల్ సెంటర్ సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో సుమారుగా 33 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇప్పడు ఆ ఘటన నుంచి తేరుకోక ముందే ఈ కారు బాంబు పేలుడు ఘటన స్ధానికుల్లో భయాందోళనను కలగజేస్తుంది.












Click it and Unblock the Notifications