సింగపూర్ హోటల్లో పనిమనిషితో భారత వ్యక్తి మృతి

సింగపూర్: 31 ఏళ్ల భారత జాతీయుడు ఇండోనేషియాకు చెందిన తన పని మనిషితో కలిసి సింగపూర్ హోటల్లో మరణించి కనిపించాడు. సింగపూర్‌లోని గేలాంగ్ హోటల్ గదిలో వారి మృతదేహాలు కనపించినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.

చినసామి భాస్కర్ అనే వ్యక్తి మృతదేహాం హోటల్ గదిలో వేలాడుతూ సోమవారం సాయంత్రం కనిపించింది. కాగా, 29 ఏళ్ల ఇండోనేషియా మహిళ శవంపై గొంతు కోసిన గుర్తులున్నాయి. భాస్కర్ ఐదేళ్లుగా సింగపూర్‌లోని నిర్మాణ రంగంలో పనిచేస్తున్నాడు.

31-Year-Old Indian Man, Indonesian Woman Found Dead in Singapore Hotel: Report

భాస్కర్ కుటుంబ సభ్యులతో తాము టచ్‌లో ఉన్నామని భారత హై కమిషన్ కార్యాలయం తెలిపింది. పోలీసుల దర్యాప్తు ముగిసిన తర్వాత భాస్కర్ మృతదేహాన్ని స్వస్థలానికి పంపిస్తామని తెలిపింది. వివాహితుడైన భాస్కర్ కష్టపడి పనిచేసేవాడని ఆతని యజమాని అంటున్నాడు.

ఇండోనేషియాలోని యోగకర్తా సమీపంలో గల సోలోని ఇంటికి పని మనిషి రూలీ విద్యావతి మృతదేహాన్ని పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇండోనేషియాలో ఆమెకు వివాహం జరిగింది, ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పోలీసులు వాటిని అసహజ మరణాలుగా భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+