ITR కౌంట్‌డౌన్ స్టార్ట్: వారం రోజులే గడువు, భారీ జరిమానాలు తప్పవు!

అసెస్మెంట్ ఇయర్ 2026-27కి సంబంధించి ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు చేయడానికి మిగిలింది కేవలం కొద్ది రోజులు మాత్రమే. జూలై 31వ తేదీతో ఈ గడువు ముగియనుంది. ఆఖరి రోజల్లో సైట్ పై విపరీతమైన రద్దీ పెరిగి సర్వర్లు మొరాయించే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే చివరి దాకా వెయిట్ చేయకుండా ఇప్పుడే రిటర్న్స్ ఫైల్ చేయడం అత్యంత ఉత్తమం. ఒకవేళ గడువు దాటితే ఏకంగా రూ.5,000 వరకు ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. పైగా ఉద్దేశపూర్వకంగా ఆదాయ వివరాలు దాచేస్తే ఏకంగా 200 శాతం వరకు జరిమానా బాదే ప్రమాదం ఉంది. సమయానికి ఐటీఆర్ పూర్తి చేస్తే మీకు రావాల్సిన పన్ను రిఫండ్ చాలా వేగంగా మీ ఖాతాలో పడుతుంది.

వ్యాపార ఆదాయం లేని సాధారణ ఉద్యోగులు, వ్యక్తులకు జూలై 31 ఆఖరి తేదీ. కానీ ఆడిట్ అవసరం లేని వ్యాపారులకు ఆగస్టు 31 వరకు, టాక్స్ ఆడిట్ ఉండే ఖాతాదారులకు అక్టోబర్ 31 వరకు గడువు ఉంటుంది. మీ ఆదాయ వనరును బట్టి సరైన ఫారమ్‌ను ఎంచుకోవాలి.

ITR Filing Deadline 2026 Essential 10 Point Checklist For Taxpayers Before The July 31 Cutoff

జీతం, ఒక ఇల్లు, వడ్డీల ద్వారా ఆదాయం వచ్చేవారు సులువైన ఐటీఆర్-1 వాడవచ్చు. ఐతే, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా బిజినెస్ ఆదాయం ఉన్నవారు ఐటీఆర్-2, 3 లేదా 4ల వైపు వెళ్లాల్సి ఉంటుంది. లక్షల్లో ఆదాయం ఉండి షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసేవారు ఫారమ్ ఎంపికలో ఏమాత్రం పొరపాటు చేయకూడదు.

ఫారమ్ 16 మాత్రమే కాదు.. ఆ కాగితాలను కూడా క్రాస్ చెక్ చేసుకోండి!

చాలామంది ఆఫీసు ఇచ్చిన ఫారమ్ 16 చూసి గుడ్డిగా ఐటీఆర్ ఫైల్ చేస్తుంటారు. కానీ ఆదాయ పన్ను శాఖ వెబ్‌సైట్‌లో ఉండే 'యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్' (AIS), ఫారమ్ 26AS లోని వివరాలను కూడా సరిచూసుకోవడం తప్పనిసరి. జీతంతో పాటు బ్యాంకు డిపాజిట్ల వడ్డీలు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్ లాభాలు అన్ని ఐఏఎస్‌లో నమోదవుతాయి. ఫారమ్ 16 లోని వివరాలకు, పోర్టల్‌లోని రికార్డులకు తేడాలుంటే ఐటీ అధికారుల నుంచి వెంటనే నోటీసులు వచ్చే అవకాశం ఉంది.

జాబ్ మారినా, సైడ్ ఇన్ కమ్ ఉన్నా దేనినీ దాచలేరు!

ఈ ఏడాది ఉద్యోగం మారినవారు పాత, కొత్త కంపెనీల ఫారమ్ 16లను దగ్గర పెట్టుకుని వివరాలు చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా పన్ను మినహాయింపులు రెండుసార్లు వర్తింపజేసుకున్నారేమో సరిచూసుకోవాలి. అలాగే, షేర్ మార్కెట్లో వచ్చే స్వల్పకాలిక, దీర్ఘకాలిక లాభాలు (STCG, LTCG), ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్ ద్వారా వచ్చే నష్టనష్టాలను పక్కాగా లెక్కలు చూపించాలి. ఉమ్మడి ఆస్తుల ద్వారా వచ్చే అద్దెలు, మీకున్న అన్ని బ్యాంక్ ఖాతాల వివరాలను స్పష్టంగా వెల్లడించడం సురక్షితం.

ఓల్డ్ టాక్స్ రేజీమా? న్యూ టాక్స్ రేజీమా? లెక్క చూసుకోండి!

ప్రస్తుతం ఆటోమేటిక్‌గా కొత్త పన్ను విధానమే (New Tax Regime) అమలులో ఉంటుంది. అయితే హెచ్‌ఆర్‌ఏ (HRA), హోమ్ లోన్ వడ్డీ, విద్యుత్ రుణాలు వంటి భారీ మినహాయింపులు పొందే ఉద్యోగులకు పాత పన్ను విధానమే (Old Tax Regime) లాభదాయకంగా ఉండవచ్చు. అందుకే ఫైల్ చేసే ముందు రెండు విధానాల్లోనూ పన్ను ఎంతపడుతుందో పోల్చి చూసుకుని మీకు కలిసివచ్చే ఆప్షన్‌ను ఎంచుకోండి. ఐటీఆర్ సబ్‌మిట్ చేసిన తర్వాత మీ ఖాతా ఈ-వెరిఫికేషన్ (e-verification) చేయడం మర్చిపోవద్దు. వెరిఫికేషన్ పూర్తికాకపోతే మీరు దాఖలు చేసిన ఐటీఆర్ చెల్లదు

పొరపాటు జరిగినా టెన్షన్ వద్దు..!

అనుకోకుండా ఐటీఆర్‌లో ఏదైనా వివరాలు తప్పుగా నమోదు చేసినా లేదా ఏవైనా ఆదాయాలు చూపించడం మర్చిపోయినా భయపడాల్సిన పనిలేదు. సవరించిన రిటర్న్ (Revised Return) దాఖలు చేసేందుకు ఐటీ శాఖ అవకాశం కల్పిస్తుంది. అయితే ఎలాంటి తొందరపాటు లేకుండా, మీ దగ్గరున్న బ్యాంకు స్టేట్‌మెంట్లు, బ్రోకరేజ్ షీట్లను నిశితంగా పరిశీలించిన తర్వాతే సవరణలు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+