Greece Train Accident: గ్రీస్‍లో ఘోర రైలు ప్రమాదం.. 36 మంది మృతి..

గ్రీస్‌లో ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 36 మంది చనిపోయారు

గ్రీస్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 36 మంది మరణించారు. 85 మంది గాయపడ్డారు. గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏథెన్స్‌కు ఉత్తరాన 380కిమీ (235 మైళ్లు) దూరంలో ఉన్న లారిస్సా నగరానికి సమీపంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

25 మందికి తీవ్ర గాయాలు

25 మందికి తీవ్ర గాయాలు


అత్యంత వేగంతో రైళ్లు ఢీకొనడంతో బోగీలు పట్టాలు తప్పాయి. ముందున్న మూడు బోగీల్లో మంటలు చెలరేగాయి. దీంతో 36 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు భారీ శబ్దం వచ్చినట్లు స్థానిక నివాసి వాసిలిస్ పోలిజోస్ చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో అతను ట్రాక్ పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. 25 మంది తీవ్రంగా గాయపడినట్లు సమీపంలోని లారిస్సాలోని ఆసుపత్రి అధికారుల తెలిపారు.

రాత్రి 7.30

రాత్రి 7.30


మంగళవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో రైలు ఏథెన్స్ నుంచి బయలుదేరినట్లు స్థానిక మీడియా తెలిపింది. గూడ్స్ రైలు థెస్సలోని నుంచి లారిస్సాకు వెళుతోంది. 1972లో లారిస్సా వెలుపల రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో 19 మంది చనిపోయారు. అయితే గ్రీస్ ఉన్న పురాతన రైల్వే వ్యవస్థను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

బస్సుల్లో తరలింపు

బస్సుల్లో తరలింపు


రెండు రైళ్లు ఓకే ట్రాక్ పై రావడంతో ఈ ప్రమాదం జరిగింది. సిగ్నలింగ్ తప్పిదంతోనే ఇది జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
"ఇప్పుడు మా ప్రాధాన్యత గాయపడిన వారికి చికిత్స చేయడం, శిధిలాలలో తప్పిపోయిన వ్యక్తుల కనుగొనడం" అని ప్రభుత్వ ప్రతినిధి జియానిస్ ఒయికోనోమౌ చెప్పారు. మొత్తం 350 మందిలో 250 మంది ప్రయాణికులను బస్సుల్లో థెస్సలోనికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+