పేలుడు: 5,800 జేఎల్ఆర్ టాటా కార్లు బూడిద
బీజింగ్: చైనాలో టియాంజిన్ లో పేలుడు సంభవించి రూ. వందల కోట్ల విలువైన ఖరీదైన కార్లు బూడిద అయ్యాయి. టియాంజిన్ లోని పోర్టులో పార్క్ చేసిన 5,800 ల్యాండ్ రోవర్ల కార్లు (జేఎల్ ఆర్ కార్లు) పూర్తిగా కాలి బూడిద అయ్యాయి.
భారత మాతృ సంస్థ అయిన టాటా మోటార్ కంపెనీ నిర్వహకులు 5,800 ల్యాండ్ రోవర్ల కార్లు తయారు చేసి ముంబై నుండి చైనాకు ఎగుమతి చేసింది. చైనాలోని టియాంజిన్ లోని హార్బర్ సమీపంలో కార్లు నిల్వ చేశారు.
అక్కడి నుండి చైనాలోని వివిధ ప్రాంతాలకు కార్లు తరలించ వలసి ఉంది. అయితే ఒక్క సారిగా కార్లు పార్క్ చేసిన ప్రాంతంలో పేలుడు సంభవించింది. నిమిషాల వ్యవధిలో అన్నికార్లకు మంటలు వ్యాపించాయి.

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వందలాధి అగ్నిమాపక వాహనాలతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చెయ్యడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే కార్లు బూడిద అయ్యాయి.
ఈ ప్రమాదంలో 600 మిలియన్ డాలర్ల నష్టం జరిగిందని టాటా కంపెనీ మోటారు సంస్థ అధికారులు తెలిపారు. మంటలు వ్యాపించడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని చైనా అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications