మోడీ ప్రసంగం: 500 టాప్ సీఈవోలు, చంద్రబాబు బిజీ
హైదరాబాద్/సింగపూర్: భారత ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 18వ తేదీన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఇచ్చే ప్రసంగానికి సుమారు 500 మంది ఆస్ట్రేలియాకు చెందిన అతిపెద్ద కంపెనీల సీఈవోలు హాజరు కానున్నారు. మోడీ విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన మొదట మయన్మార్‌లో పర్యటిస్తున్నారు. గురవారం సాయంత్రం ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు.
ఇందులో భాగంగా మంగళవారం నాడు మెల్‌బోర్న్‌లో నిర్వహించే సమావేశంలో మోడీ ప్రసంగిస్తారు. ఈ ప్రసంగం వినేందుకు 500 మంది పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలు హాజరు కానున్నారు. భారత్ నుండి ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా, మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర తదితరులు ఉన్నారు.

మోడీ ప్రసంగాన్ని వినే ప్రముఖ సీఈవోలలో... ప్రాట్ ఇండస్ట్రీస్ అండ్ గ్లోబల్ చైర్మన్ ఫర్ విసీ ఇండస్ట్రీస్ సంస్థల సీఈవో అండ్ చైర్మన్ ఆంటోనీ జెసెప్ ప్రాట్, బీహెచ్పీ బిలిటన్ లిమిటెడ్ సీఈవో ఆండ్రా మెకంజీ, టింటో అండ్ టోనీ క్రిప్స్ మేనేజింగ్ డైరెక్టర్ పిల్ ఎడ్మండ్స్ తదితరులు ఉన్నారు.
నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ (ఏఐబీసీ) ఏర్పాటు చేసింది. ఏఐబీసీ సంస్థ 1986లో ఏర్పాటు చేయబడింది. దీనిని అప్పటి భారత, ఆస్ట్రేలియా ప్రధానులు రాజీవ్ గాంధీ, బోబ్ హాకేలో ప్రారంభించారు. దివంగత రాజీవ్ గాంధీ అనంతరం, 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో అడుగుపెడుతున్న ప్రధాని మోడీయే.
సింగపూర్‌లో బాబు బిజీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో బిజీబీజీగా గడుపుతున్నారు. ఏపీ రాజధాని, పెట్టుబడులు ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు పర్యటన సాగుతోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా పేరుతో పెట్టుబడుల కోసం ఆకర్షిస్తున్నారు. చంద్రబాబు మేడ్ ఇన్ ఏపీ పేరుతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సింగపూర్‌లోని పారిశ్రామికవేత్తలను కోరారు.
చంద్రబాబు గురువారం ప్రముఖ కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. పెట్టుబడులు పెట్టాలని కోరారు. మేక్ ఇన్ ఇండియా, మేడిన్ ఏపీ అనేది తన నినాదమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామమన్నారు. ఏపీ ఇచ్చిన ప్రజెంటేషన్ సీఈవోలను ఆకర్షించింది. చంద్రబాబు సింగపూర్ ఎయిర్‌లైన్స్ అధికారులతోను సమావేశమయ్యారు. ఏపీతో సింగపూర్‌కు ఎయిర్ కనెక్టవిటీ పైన చర్చించారు.
బుధవారం నాడు చంద్రబాబు లివబుల్ సిటీస్ ఫర్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖూను కలిశారు. ఈ విషయాన్ని చంద్రబాబు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. మిస్టర్ ఖూ అర్బన్ ప్లానింగ్ ప్రాక్టీసెస్ పైన తమకు వివరించారని పేర్కొన్నారు. చంద్రబాబు నేషనల్ వాటర్ ఎజేన్సీ, పబ్లిక్ యుటిలిటీ బోర్డ్ ఆఫ్ సింగపూర్.. తదితర శాఖ నిపుణులను కలుస్తున్నారు. సింగపూర్‌లో మెరీనా బే సాండ్స్ స్కై పార్కును పరిశీలించారు. వాణిజ్య, పారిశ్రామిక ఉప మంత్రితో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications