పేలుళ్లు: 56మంది మృతి, 100మందికి గాయాలు
బాగ్దాద్: ఇరాక్ మరోసారి వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఇరాక్‌లో మూడు పట్టణాల్లో కారు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో 56 మంది మరణించగా, వందమందికి పైగా ప్రజలు గాయపడ్డారు.
డియాలా ప్రావిన్స్‌లోని షియాలో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 32మంది మృతి చెందగా, మరో 58మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాస్రా ప్రావిన్స్‌లోని శివారు ప్రాంతంలో మరో బాంబు పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో 10మంది మృతి చెందగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాగ్దాద్‌లోని హుస్సేనియా ప్రాంతంలో జరిగిన మూడో బాంబు పేలుడు ఘటనలో 14 మంది మృత్యువాత పడ్డారు.

వరుస బాంబు పేలుళ్లలో మొత్తం 56 మంది మృతి చెందగా, 118 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దాడులకు పాల్పడింది ఐఎస్ ఉగ్రవాదులేనని అధికారులు భావిస్తున్నారు.
కాగా, ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఉగ్రవాదుల దాడుల్లో 717 ఇరాక్ పౌరులు మరణించగా, మరో 1,216 మంది గాయపడ్డారు.












Click it and Unblock the Notifications