ట్రంప్ నేతృత్వంలో దాడి: అల్‌ఖైదా ఉగ్రవాదులు హతం, ఓ అమెరికా సైనికుడు
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా తొలి దాడి చేసింది. యెమెన్‌లో అమెరికా సైన్యం జరిపిన వైమానిక దాడిలో 41మంది అల్ ఖైదా ఉగ్రవాదులు హతమయ్యారు.
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా తొలి దాడి చేసింది. యెమెన్‌లో అమెరికా సైన్యం జరిపిన వైమానిక దాడిలో 41మంది అల్ ఖైదా ఉగ్రవాదులు హతమయ్యారు.
ఈ దాడిలో మరో 16 మంది సామాన్యులు కూడా చనిపోయారు. ఈ దాడి ఆదివారం నాడు చోటు చేసుకుంది. దాడి సమయంలో ఒక అమెరికా సైనికుడు కూడా మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

చనిపోయిన వారిలో ఎనిమిది మంది మహిళలు, ఎనిమిది మంది చిన్నారులు కూడా ఉన్నారు. బాయిడాలోని సెంట్రల్ ప్రావిన్సు.. యాక్లా డిస్ట్రిక్ట్‌లో ఈ దాడులు జరిగాయి. అల్ ఖైదా మిలిటెంట్లకు చెందిన మసీదు, మెడికల్ ఫెసిలిటీ, స్కూల్ కూడా ధ్వంసమైంది.












Click it and Unblock the Notifications