ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!
ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) మొదలుపెట్టిన యుద్దం మూడు వారాలకు చేరుతోంది. అయినా ఇప్పటికీ యుద్దం ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యంగా ఇరువర్గాలూ భారీ నష్టాలు చవిచూస్తున్నా, యుద్దంతో సంబంధం లేని గల్ఫ్ దేశాలూ నష్టపోతున్నా యుద్దం ఆపేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్ధితి. మధ్యవర్తిత్వం కోసం చేస్తున్న ప్రయత్నాల్ని సైతం ఇరువర్గాలు స్వాగతించడం లేదు. అందుకు బదులుగా తాడోపేడో తేల్చుకుంటామంటున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా తమ జాతీయ భద్రతా మండలి ఛీఫ్ అలీ లారిజానీని ఇజ్రాయెల్ దాడుల్లో కోల్పోయిన ఇరాన్ తాజాగా ప్రపంచ దేశాలకు కీలక హెచ్చరికలు చేసింది. పశ్చిమ ఆసియా సంక్షోభం యొక్క పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా అందరినీ తాకబోతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి (abbas Araghchi)హెచ్చరించారు. ఇరాన్‌పై యుద్ధం అన్యాయమైనదని యూరోపియన్, అమెరికా అధికారులతో సహా పెద్ద సంఖ్యలో గళాలు వినిపిస్తున్నాయని, అంతర్జాతీయ సమాజంలోని ఇతర సభ్యులు కూడా ఇదే బాటలో నడవాలని ఆయన కోరారు.

A rising number of voices—incl European and U.S. officials—exclaim that the war on Iran is unjust. More members of the international community should follow suit.
— Seyed Abbas Araghchi (@araghchi) March 17, 2026
Wave of global repercussions has only begun and will hit all—regardless of wealth, faith, or race. Our foe is one. pic.twitter.com/sZGHyvv6v8
ఇరాన్ వార్ కు వ్యతిరేకంగా అమెరికా ఉగ్రవాద నిరోధక దళం ఛీఫ్ జో కెంట్ రాజీనామాపై స్పందిస్తూ.. ఇతర పాశ్చాత్య దేశాల అధికారులూ ముందుకు రావాలన్నారు. ప్రపంచ దేశాలపై యుద్ధ ప్రభావం పరంపర ఇప్పుడే మొదలైందని సంపద, మతం లేదా జాతితో సంబంధం లేకుండా అందరినీ తాకుతుందని ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. తన ట్వీట్ కు అమెరికా జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ రాజీనామా ప్రకటన కాపీని జతచేశారు. ఇప్పటికే తమపై యుద్దానికి దిగిన అమెరికా-ఇజ్రాయెల్ పై ప్రపంచదేశాల ఒత్తిడి పెంచేందుకు వీలైనన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్న ఇరాన్.. హార్ముజ్ జలసంధిని ఇందుకు కీలకంగా వాడుకుంటోంది. అలాగే గల్ఫ్ దేశాలపై దాడులకు దిగుతోంది.
-
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
ఇరాన్ క్షిపణి దాడిలో బూడిదైన 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ'.. వీడియో వైరల్ -
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ఇరాన్ కు కొత్త భద్రతా ఛీఫ్-లారిజానీ స్ధానంలో-ఎవరీ మహమ్మద్ జోల్ఘదర్? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్













Click it and Unblock the Notifications