బిగ్ షాక్.. సౌదీ రిఫైనరీపై డ్రోన్ దాడి.. భారీ విధ్వంసం..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. రెండు వారాలకు పైగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య భీకర యుద్ధం అంతకంతకూ పెరుగుతోంది. ఇరాన్ లోని అణు కేంద్రాలు, గ్యాస్ రిఫైనరీ క్షేత్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ తోపాటుగా అమెరికాలోని ఇంధన లక్ష్యాలే కేంద్రంగా దాడులకు పాల్పడుతోంది.
ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. రెండు వారాలుగా యుద్ధం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇరాన్ మరోసారి సౌదీ అరేబియాపై దాడులకు దిగింది. సౌదీ అరేబియాకు చెందిన అరామ్ కో రిఫైనరీపై దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఈ ఆయిల్ రిఫైనరీ పూర్తిగా ధ్వంసం అయింది. ఈ దాడుల్లో రిఫైనరీ ధ్వంసం అయినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు ఇరాన్ హార్మూజ్ జలసంధి మూసివేసిన నేపథ్యంలో ఇంధన కొరత రాకుండా ప్రత్యామ్నాయంగా ఎర్రసముద్రం ద్వారా చమురును రవాణా చేస్తోంది. ఇరాన్ కు చెందిన ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్, అమెరికా ఈ దాడులు చేపట్టిన నేపథ్యంలో అందుకు ప్రతీకారంగా ఖతార్ లోని కీలక రస్ లాఫెన్ ఇండస్ట్రీయల్ సిటీపై ఇరాన్ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ దాడికి ముందు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ లోని ఇంధన కేంద్రాలను ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక సౌదీలోని పౌర, ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను సౌదీ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.

ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ కతీబ్ అలాగే లారిజానీ మరణాలకు ప్రతీకారంగా ఆ దేశం ఈ దాడులను చేపట్టినట్లు స్పష్టం అవుతోంది. అలాగే ఖతార్ లోని అత్యంత కీలకమైన రస్ లాఫన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ క్షిపణులతో దాడులకు పాల్పడినట్లు స్పష్టం అవుతోంది. ఈ దాడిలో భారీ స్థాయిలో ఈ ప్రాంతం దెబ్బతింది.
-
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
హార్ముజ్ రక్షకుడిని చంపేశాం..! ఇజ్రాయెల్ సంచలన ప్రకటన..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
అమెరికా-ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్: రంగంలోకి హిజ్బుల్లా..! -
భారత్కు ఇరాన్ బంపరాఫర్!.. ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
Lockdown: లాక్ డౌన్ ఎక్కడంటే ?- పార్లమెంట్ లో తేల్చేసిన ఆర్థికమంత్రి..!












Click it and Unblock the Notifications