• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘ఐటీ’కి ఆటోమేషన్ ముప్పు తప్పుతుందా?.. రోబటైజేషన్‌కు అమెరికన్లు ‘నో’!!

By Swetha Basvababu
|

వాషింగ్టన్: ఇప్పటివరకు ఆటోమేషన్ వల్ల ఐటీ రంగంలో నిపుణుల ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని.. కోడింగ్, అనలిటిక్స్ విభాగాల్లో మాత్రమే ఉద్యోగాలు ఉంటాయని ప్రచారం జరుగుతూ వచ్చింది. అంతే కాదు ఆటోమేషన్‌తో ప్రపంచానికి ఎంతో మేలు.. పనులన్నీ అత్యంత వేగంగా చక్కబెట్టుకోవచ్చునని అంతా భావించారు. ఇదీ కొంతకాలంగా సంపన్న దేశాల్లో వినిపిస్తున్న మాట. డ్రైవర్ల రహిత కార్లు, వ్యక్తిగత సహాయకుల స్థానంలో రోబో సర్వెంట్లు, మొబైల్‌ ఫోన్లతోనే పనులన్నీ చక్కబెట్టే అవకాశం.. ఇలా ఎన్నో వసతులు అందుబాటులోకి వస్తాయని ఎందరో ఆశపడ్డారు. కానీ అమెరికన్లు ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. రోబో సర్వెంట్లు, డ్రైవర్లు లేని కార్లను వారు ఇష్టపడటం లేదు.

మానవ చోదకుడు ఉంటేనే మంచిదనే ఆలోచన అత్యధిక అమెరికన్లలో ఉంది. రోబో సర్వెంట్‌ చేతిలో బందీ అయిపోతామేమో.. అని భయపడే వారు కూడా ఉన్నారు. మొత్తం మీద ఆటోమేషన్‌, రోబోటిక్స్‌ విస్తరణ ఇబ్బందికరమనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది అమెరికన్లు వ్యక్తీకరించడం ఆసక్తికర పరిణామం. దాదాపు 72 శాతంమంది అమెరికన్లు 'రోబటైజేషన్‌' ప్రక్రియకు వ్యతిరేకంగా ఉన్నారని 'ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌' తాజా అధ్యయనంలో తేలింది.

 ఆటోమేషన్ కోసం సిలికాన్‌ వ్యాలీలో జోరుగా పరిశోధనలు

ఆటోమేషన్ కోసం సిలికాన్‌ వ్యాలీలో జోరుగా పరిశోధనలు

మనుషులు చేయాల్సిన పనులను రోబోలు, కంప్యూటర్లు నిర్వహిస్తాయనే ఆలోచనను అమెరికన్లలో 72 శాతం వ్యతిరేకిస్తున్నారు. ఆటోమేషన్‌ వల్ల ప్రజల్లో ఆర్థిక అంతరాలు పెరిగిపోతాయని, ధనికులు- పేదల మధ్య మరింత అగాథం ఏర్పడుతుందని, కంప్యూటర్ల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి మళ్లీ అదే స్థాయిలో ఉద్యోగాలు లభించకపోవచ్చని 75 శాతం భయ పడుతున్నారు. ఆటోమేషన్‌, రోబటిక్స్‌ పరిజ్ఞానంపై సిలికాన్‌ వ్యాలీలో ఎన్నో సంస్థలు ముమ్మర పరిశోధనలు సాగిస్తున్నాయి. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు, ఆటోమొబైల్‌ సంస్థలు, మొబైల్‌ టెక్నాలజీ దిగ్గజాలు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరించటానికి భారీ కసరత్తే చేస్తున్నాయి. ఆ బాటలోనే జపాన్‌, చైనా, దక్షిణ కొరియా తదితర దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేసే యంత్రాలు, వ్యాపార సంస్థల్లో హెల్ప్‌ డెస్క్‌ల్లో ఉండే సలహాదార్ల స్థానంలో కంప్యూటర్లు, నియామకాలు చేపట్టే ఆల్గోరిథమ్‌ ప్రోగ్రాం.. ఇటువంటి పలు రకాల మార్పులు ఆటోమేషన్‌ వల్ల వస్తాయని ఎదురుచూస్తున్నారు. డ్రైవర్లు అవసరం లేని కార్ల ఆవిష్కరణ దాదాపుగా పూర్తయినట్లే. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ సాంకేతిక పరిజ్ఞానం అమల్లోకి తెచ్చేందుకు వీలుగా అమెరికా కాంగ్రెస్‌ చట్టం కూడా చేయబోతోంది. కానీ ఈ తరుణంలో ప్రజల్లో ఈ మార్పులపై పెద్దగా ఆసక్తి లేదనే వాస్తవం ‘రోబటైజేషన్‌'పై పనిచేస్తున్న సంస్థలు, దాన్ని సమర్థకులకూ మింగుడుపడని విషయమే.

 గూగుల్ ఆధ్వర్యంలో 2009లో డ్రైవర్ రహిత కార్ల అభివృద్ధి ప్రక్రియ మొదలు

గూగుల్ ఆధ్వర్యంలో 2009లో డ్రైవర్ రహిత కార్ల అభివృద్ధి ప్రక్రియ మొదలు

దాదాపు సగానికి పైగా అమెరికన్లు డ్రైవర్‌ లేని కారులో ప్రయాణం అంటేనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి కార్లో ప్రయాణాన్ని ఇష్టపడటం లేదు. ఎంత డ్రైవర్‌ అవసరం లేని కారైనా అత్యవసర సమయాల్లో దాన్ని నియంత్రించడానికి డ్రైవర్‌ ఉండాల్సిందేనని అంటున్నారు. ఇటువంటి కొత్త తరహా కారుపై ఆసక్తి చూపటానికి బదులు ఆందోళనే అధికంగా వ్యక్తం అవుతోందని ‘ప్యూ' పరిశోధన స్పష్టం చేసింది. సర్వేలో పాల్గొన్న 87 శాతం ప్రజలు అత్యవసర సమయాల్లో కారును అదుపు చేసే డ్రైవర్‌ ఉండాలని అభిప్రాయపడగా, 83 శాతంమంది రోడ్ల మీద డ్రైవర్‌లెస్‌ కార్లు తిరగటానికి ప్రత్యకంగా రోడ్లు లేదా రోడ్ల మీద ప్రత్యేకంగా లేన్లు ఉండాలని సూచించారు. డ్రైవర్‌లెస్‌ కార్ల అభివృద్ధి ప్రక్రియను గూగుల్‌ 2009లో చేపట్టింది. జనరల్‌ మోటార్స్‌, టెస్లా, ఆడి, ఫోర్డ్‌ తదితర అగ్రగామి ఆటోమొబైల్‌ కంపెనీలు ఇటువంటి వాహనాలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నాయి. 2020 నాటికి డ్రైవర్‌లెస్‌ను కారును విడుదల చేయనున్నట్లు ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఆడి ప్రకటించింది. మానవ చోదకులు తప్పులు చేసే అవకాశం ఉంది కానీ, కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌, సెన్సర్ల పరిజ్ఞానంతో నడిచే డ్రైవర్‌లెస్‌ కారు తప్పులు చేయదని ఈ మార్పు సమర్థకులు చెప్తున్నారు. వచ్చే 50 ఏళ్లలో రహదార్ల మీద తిరిగే కార్లలో అత్యధిక శాతం డ్రైవర్‌లెస్‌ కార్లే ఉంటాయని కూడా ఎక్కువమంది విశ్వసిస్తున్నారు. అన్నింటికంటే చాలా మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఎక్కువమంది భయపడుతున్నారు. ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లలో ఉద్యోగాలు, బీమా క్లెయిముల ప్రాసెసింగ్‌ పనులు, నియామకాలు.. ఇవన్నీ కంప్యూటర్లే చేసే రోజు వస్తుందని భావిస్తున్నారు.

ఇంక్రిమెంట్లు, పదోన్నతులకు ఇక చెక్

ఇంక్రిమెంట్లు, పదోన్నతులకు ఇక చెక్

ఆటోమేషన్‌ ప్రక్రియతో ఉద్యోగాలు పోతాయనే భయం అమెరికన్లలో కనిపిస్తోంది. ఇప్పుడు మనుషులు చేసే పనులన్నీ వచ్చే రెండు మూడు దశాబ్దాల్లో కంప్యూటర్లు - రోబోట్లు చేస్తాయని 77 శాతంమంది అమెరికన్లు విశ్వసిస్తున్నారు. కొందరు ఉద్యోగుల్లో తాము చేసే పనులు కంప్యూటర్లు చేసే రోజు వస్తే తమ ఉపాధికి ముప్పు పొంచి ఉన్నట్లేనన్న భయం 30 శాతం మందిలో ఉంది. ఆతిథ్య రంగం, రిటైల్‌, ఇతర సేవా రంగాల్లోని వారిలో ఈ ఆందోళన అధికంగా ఉంది. ఇక ఆరు శాతం మందయితే ఇప్పటికే తమపై ఆటోమేషన్‌ ప్రభావం ఉన్నట్లు చెబుతున్నారు. ఉద్యోగాలు పోకపోయినా కంప్యూటరీకరణతో భవిష్యత్‌లో తమకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, జీతాల పెంపుదల ఉండకపోవచ్చని 46 శాతం మంది భయపడుతున్నారు. వర్డ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీస్‌, స్పెడ్‌షీట్‌ సాఫ్ట్‌వేర్‌, స్మార్ట్‌ఫోన్స్‌, ఇమెయిల్‌ - సోషల్‌ మీడియా, డెయిలీ షెడ్యూళ్ల సాఫ్ట్‌వేర్‌, ఆటోమేటెడ్‌ వర్కర్‌, ఇండస్ట్రియల్‌ రోబో, ఉద్యోగాలపై ప్రభావం చూపుతున్నట్లు అత్యధికులు భావిస్తున్నారు. ఈ సర్వేలో కొన్ని ప్రశ్నలకు అమెరికన్లు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఎక్కువ మంది ఆటోమేషన్‌ను ఇష్టపడటం లేదని వారి స్పందన చూస్తే స్పష్టమవుతోంది. డ్రైవర్ లేని ప్రయాణాన్ని 56 శాతం మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. రోబో సర్వెంట్లను వినియోగించబోమని దాదాపు 59 శాతం మంది చెప్తున్నారు. ఇక 78 శాతం మంది కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టే సంస్థలో పని చేయడానికి వెళ్లమని తేల్చి చెప్తున్నారు.

 బిల్లింగ్ తదితర పనులన్నీ కంప్యూటర్లతోనే ఇక

బిల్లింగ్ తదితర పనులన్నీ కంప్యూటర్లతోనే ఇక

తన వద్దకు చికిత్స కోసం వచ్చిన రోగికి ఏ జబ్బు చేసింది, దాని తీవ్రత ఎంత.. అనే విషయాలను తెలుసుకోవటానికి వైద్యుడు పూర్తిగా కంప్యూటర్‌ ప్రోగ్రాం మీద ఆధారపడే రోజు అతి దగ్గరలోనే ఉన్నదని మెజార్టీ అమెరికన్లు అంటున్నారు. ఇది వచ్చే 20 ఏళ్లలో వచ్చే మార్పని అని వారు భావిస్తున్నారు. ఇక రిటైల్‌ కిరాణ స్టోర్లలో సహాయకులు దాదాపు కనుమరుగవుతారు. కంప్యూటర్లే అన్ని పనులు చేస్తాయి. వినియోగదారులు తమకు కావలసిన వస్తువులు కొనుక్కోడానికి ఎవరితోనూ మాట్లాడవలసిన పని ఉండదు. బిల్లింగ్‌, ఇతర పనులన్నీ కంప్యూటర్లే పూర్తి చేస్తాయి. ఆన్‌లైన్ కొనే వస్తువులను కొరియర్ ప్రతినిధులు బట్వాడా చేస్తున్నారు. కానీ భవిష్యత్‌లో ఈ పనిని డ్రోన్లు గానీ, రోబోలు గానీ చేస్తాయి! ఆశ్చర్యంగా అనిపిస్తున్నప్పటికీ జరగబోయేది ఇదేనని విశ్లేషకులు అంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
From driverless cars to a workplace staffed by robots, automation has the potential to reshape many facets of American life. A Pew Research Center survey conducted in May examines Americans’ attitudes about four emerging automation technologies: workplace automation, driverless cars, robot caregivers, and computer algorithms that evaluate and hire job applicants. Although Americans tend to have a positive view of technology overall, this survey finds that the continuing march of new technologies is causing them concern.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more