Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మొరాకాలో భారీ భూకంపం: కుప్పకూలిన భవనాలు, 600 మందికిపైగా మృతి, మోడీ విచారం, భరోసా

జోహన్నెస్‌బర్గ్: ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి మొరాకోలోని హై అట్లాస్ పర్వతాలపై 6.8 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. పెద్ద పెద్ద భవనాలు భూకంప తీవ్రతకు నేలమట్టమయ్యాయి. దీంతో 632 మందికిపైగా మరణించారు.

ధ్వంసమైన భవనాల శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. పలువురు తీవ్రగాయాలతో బయటపడ్డారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భూకంపం సంభవించిన సమయంలో అనేక మంది ప్రజలు భయంతో నివాసాల నుంచి బయటికి పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

300 Killed In Powerful Earthquake In Morocco: India Ready To Help, says PM Modi

మొరాకో భూకంప ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మొరాకో ప్రజలకు అన్ని విధాలా సాయం అందిస్తామని చెప్పారు.

అల్జజీరా ప్రకారం.. ప్రావిన్షియల్ ప్రాంతాలలో భూకంపం కేంద్రం సమీపంలో చాలా మంది ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. భూకంప కేంద్రం సాపేక్షంగా 18.5 కి.మీ లోతులో ఉందని, మర్రకేష్‌కు నైరుతి దిశలో 72 కి.మీ (44 మైళ్లు), ఔకైమెడెన్ పట్టణానికి పశ్చిమాన 56 కి.మీ (సుమారు 35 మైళ్లు) సంభవించిందని నివేదిక పేర్కొంది.

యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల తర్వాత (22:00 GMT) ప్రకంపనలు సంభవించాయి. పెద్ద పెద్ద భవనాలు కూలిపోవడంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఓ చిన్నారి శిథిలాల కింద ఏడుస్తూ కనిపించిన దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి.

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన 'ఓల్డ్ సిటీ'లోని కొన్ని భవనాలు ఆ రోజు కూలిపోయాయని మర్రకేచ్ నివాసితులు (భూమికేంద్రానికి సమీపంలో ఉన్న ప్రధాన నగరం) చెప్పారు. ధ్వంసమైన కార్లపై పడి ఉన్న శిథిలాలతో పడిపోయిన మసీదు మినార్ చిత్రాలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చేరుకోవడానికి కష్టంగా ఉన్న పర్వత ప్రాంతాల్లోనే అత్యధిక మరణాలు నమోదయ్యాయని స్థానిక అధికారి ఒకరు తెలిపారు.

ప్యాన్ అరబ్ అల్ అరేబియా న్యూస్ ఛానెల్ ప్రకారం.. ఓ భవనం కుప్పకూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారు. వందలాది మంది భూకంపం సంభవించిన సమయంలో ఆర్తనాదాలు చేసుకుంటూ బయటికి పరులుగు తీస్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+