మధ్య అమెరికాను వణించిన భూకంపం: జనం పరుగులు
మధ్య అమెరికాను భూకంపం వణికించింది. కరేబియన్ కోస్ట్ ఆఫ్ నికారగువా, కోస్టా రికాలో భారీ తీవ్రతతో భూకంపం సంభవించింది.
వాషింగ్టన్: మధ్య అమెరికాను భూకంపం వణికించింది. కరేబియన్ కోస్ట్ ఆఫ్ నికారగువా, కోస్టా రికాలో భారీ తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు.
ఎల్ సల్వెడార్‌కు 120 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు యూఎస్ జియాలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. భారీ ప్రకంపనలతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ భూకంపం వల్ల ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం కలిగినట్లు సమాచారం లేదు.

తైవాన్‌లోనూ భూకంపం
తైవాన్‌లో శుక్రవారం తెల్లవారుజామున భూకంపంసంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.4గా నమోదైంది. హ్వాలియాన్ నగరానికి పది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో బయటికి పరుగులు తీశారు.
ఫిబ్రవరిలో తైనన్ నగరంలో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ కూలిపోయి 117 మంది మరణించారు. 1999 సెప్టెంబర్‌లో తైవాన్‌లో 7.6 తీవ్రతతో అతి భయంకర భూకంపం సంభవించడంతో 2,400 మంది ప్రాణాలు కోల్పోయారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications